ఈ పండు ఆరోగ్యానికి ఎంతో అవసరం తినడం మర్చిపోకండి

ఈ పండు ఆరోగ్యానికి ఎంతో అవసరం తినడం మర్చిపోకండి

బిజీగా ఉన్న ఈ నాటి జీవితంలో ప్రతి వ్యక్తికి ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్న పరిస్తితులు కనిపిస్తున్నాయి . మారుతున్న వాతావరణ పరిస్థితులు , తీసుకుంటున్న ఆహారం వంటి అనేక పరిణామాలు వ్యక్తి జీవితానికి అనేక ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది అందులో బంగాణగానే మనం అత్యాదిక  పోషక విలువలు కలిగిన  అత్తి పండ్లలో (అంజీర పండ్లు) ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంన్నాయి . వాటిని తాజాగా లేదా ఎండబెట్టి లేదా ఇతర రూపాల్లో కూడా తినవచ్చు. వీటిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. అలాగే ఆరోగ్యకరమైన పేగు వ్యవస్థను ప్రోత్సహిస్తుంది. వీటిలో విటమిన్లు ఎ, బి, కె, అలాగే పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు కూడా అధికంగా ఉంటాయి.
జీర్ణ ఆరోగ్యం : వీటిలో ఫైబర్‌ ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణక్రియకు సహాయపడుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. వీటిలో ప్రీబయోటిక్స్‌ కూడా ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన గట్‌ బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.
గుండె ఆరోగ్యం : ఈ పండ్లలో ఉండే పొటాషియం, మెగ్నీషియం రక్తపోటును నియంత్రించ డానికి అలాగే గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి సహాయపడతాయి. యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల మంటను తగ్గించ డానికి, గుండె జబ్బుల నుండి రక్షించడానికి సహాయపడతాయి.
ఎముకల ఆరోగ్యం : ఈ పండ్లు కాల్షియానికి మంచి మూలం. వీటిలో ఉండే విటమిన్‌ కె ఎముక జీవక్రియలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇంకా బోలు ఎ ముకల వ్యాధిని నివారించడంలో సహాయపడుతుంది.
బరువు నిర్వహణ : అత్తి పండ్లు తక్కువ కేలరీలు, పోషకాలు అధికంగా ఉండే ఆహారం.
గర్భిణీలకు ఆరోగ్య ప్రయోజనాలు : గర్భిణీలు అంజీర పండ్లను తినడం ద్వారా అనేక ప్రయోజనాలను పొందవచ్చు. పిండం అభివృద్ధికి చాలా అవసరమైన ఫోలేట్‌ ఈ పండ్లలో లభిస్తుంది. పుట్టుకతో వచ్చే లోపాలను నివారించడంలో సహాయ పడుతుంది. అత్తి పండ్లలోని ఐరన్‌ గర్భధారణ సమయంలో రక్తహీనతను నివారించడంలో కూడా సహాయపడుతుంది. శిశువు ఎముకలు, దంతాల అభివృద్ధికి ఎంతగానో సహాయపడుతుంది.

Author

Was this helpful?

Thanks for your feedback!