కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం లో పాల్గొన్న డాక్టర్ గార్లపాటి మద్దులేటీ స్వామి

కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం లో పాల్గొన్న డాక్టర్ గార్లపాటి మద్దులేటీ స్వామి

విజయవాడ న్యూస్ వెలుగు: భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవాడ ఆంధ్రరత్న భవన్ లోరాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఏపీసిసి అధ్యక్షురాలు వై ఎస్ షర్మిల రెడ్డి , మరియు నంద్యాలపార్లమెంట్ డిసిసి అధ్యక్షులు, ఏఐసీసీ మెంబర్ శ్రీ జంగిటి లక్ష్మి నరసింహ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమానికి డోన్ నియోజకవర్గం నుంచి ఇంచార్జి డాక్టర్ గార్లపాటి మద్దులేటీ స్వామి, నంద్యాల డిసిసి ఉపాధ్యక్షులు ఉన్నిగొర్ల జనార్దన్ లు పాల్గొన్నారు.విజయవాడ పట్టణములో స్థానిక కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో ఉన్న పార్టీ స్థూపం దగ్గర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు జెండా ఆవిష్కరన ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఈ దేశానికి స్వాతంత్య్రం తీసుకవచ్చి దేశానికి దిశ దశ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ,దీనిని 1885 డిసెంబర్ నెల 28 వ తేదీన స్థాపించడం జరిగింది.అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ దేశములో పేదలకు కావలిసిన పథకాలను రూపకల్పన చేసి సామాజిక న్యాయాన్ని ,మత సామరస్యాన్ని పాటించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని వారు కొనియాడారు ,72 మంది మేధావులైన ఏ ఓ.హ్యూమ్,దాదా బాయి నౌరోజి,లాంటి అనేక మంది మేధావులు కలసి ఏర్పాటు చేసిన ఈ పార్టీ లో పని చేయడం ఎంతో సంతోషంగా ఉందని,పంచవర్ష ప్రణాళికలను,20 సూత్రాల కార్యక్రమాన్ని,బహుళార్ధక సాధక ప్రాజెక్టు ల నిర్మాణం ,బ్యాంకుల జాతీయికరణ,నూతన ఆర్ధిక సంస్కరణలు, ఎస్సి,ఎస్టీ సబ్ ప్లాన్, ఉపాదిహామిపథకాన్ని 108,104,పథకాలను ప్రవేశపెట్టి అమలుచేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని వారు అన్నారు. ప్రసుత కేంద్ర ప్రభుత్వం వీటి అన్నిటిని,అమ్మివేసి పాలన కొనసాగిస్తుందని,దేశములో ప్రజాస్వామ్య ము ప్రమాదంలో పడిందని వారు విమర్శించారు. అంతేకాకుండా దేశములో రాష్ట్రములో దళిత గిరిజనులు, బహుజనులు ,మైనార్టీలపై దాడులు పెరిగాయని,యువత అప్రమతంగా ఉండాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షులు వడ్డీ సోమశేఖర్,నంద్యాల జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు పి జీవన్ బాబు,డిసిసి ప్రధాన కార్యదర్శి&న్యాయవాది వడ్డే రాజశేఖర్, కాంగ్రెస్ పార్టీ డిసిసి కార్యదర్శి న్యాయవాది గోపినాథరావ్ లక్ష్మణ్,న్యాయవాది హనుమాన్ ,,శేఖర్, షేక్షావలి తదితరులు పాల్గొన్నారు.

 

Author

Was this helpful?

Thanks for your feedback!