
రెండు రోజుల్లో నలుగురు మృతి : కాంగ్రెస్
Amaravathi News Velugu: రాజమండ్రిలో కల్తీ పాల ఘటన తీవ్ర భయాందోళనకు గురిచేసిందని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. విషపు పాలు తాగి రెండు రోజుల్లో నలుగురు చనిపోవడం అత్యంత బాధాకరమని , దీనివల్ల కిడ్నీ సమస్యతో పరిస్థితి విషమించి 8 మంది ఆసుపత్రుల్లో చేరడం ఆందోళనకు గురి చేసిందని , మృతుల కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసినట్లు వెల్లడించారు. . ఆసుపత్రుల్లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వారికి తక్షణం మెరుగైన వైద్యసేవలు అందించాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినట్లు తెలిపారు. చనిపోయిన కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని , కల్తీ పాల సరఫరాపై నిజాలు నిగ్గుతేల్చాలన్నారు . ఉన్నత స్థాయి కమిటీ నియమించి దర్యాప్తు ముమ్మరం చేయాలని ప్రభుత్వాన్ని ఆమె కోరారు . కల్తీ పాలు ఘటనలో బాధితుల సంఖ్య పెరగకుండా తక్షణం మెడికల్ క్యాంపు లు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు.

