
పేదల ఇండ్లకు మీటర్లు ఇవ్వండి: సీపీఐ
కర్నూలు (న్యూస్ వెలుగు ) మర్చి 23: కర్నూల్ నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ పరిధికి సంబంధించిన 20 వార్డుకు లో నివాసముంటున్న చదువుల రామయ్య కాలనీ వాసులకు కరెంటు మీటర్లు ఇవ్వాలని ఈరోజు 12 గంటలకు కలెక్టర్ ఆఫీస్ లోని స్పందన కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి పి రామకృష్ణారెడ్డి నగర సహాయ కార్యదర్శి
Dశ్రీనివాసరావు నగర కార్యవర్గ సభ్యులు గిడ్డమ్మ బీసన్న సురేష్ కాలనీవాసులు రసూల్ ఆచారి, తదితరులు జాయింట్ కలెక్టర్ కలిసిన వారిలో ఉన్నారు నగర కార్యదర్శి పి రామకృష్ణారెడ్డి జాయింట్ కలెక్టర్ గారి తో మాట్లాడుతూ దాదాపు 5 సంవత్సరాల నుండి ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారు వారందరికీ పట్టాలు ఇవ్వాలని గతంలో జిల్లా మంత్రివర్యులు టీజీ భరత్ గారికి మరియు రెవిన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారికి జిల్లా ఇన్చార్జి మంత్రి నిమ్మల రామానాయుడు గారికి కలిసి పట్టాలు ఇవ్వాలని వినతి పత్రాలు ఇవ్వడం జరిగినది త్వరలోనే పట్టాల మంజూరు చేస్తామని హామీ ఇచ్చి ఉన్నారు కానీ ఇప్పటిదాకా పని జరగలేదు సార్ పేదలు ఇప్పటికే చీకటిలో ఉన్నారు కనుక వారందరికీ కరెంటు మీటర్లు ఇచ్చి వారి జీవితాల్లో వెలుగులు నింపాలని జాయింట్ కలెక్టర్ గారిని కోరడం జరిగినది జాయింట్ కలెక్టర్ గారు మాట్లాడుతూ అర్బన్ రెవెన్యూ అధికారులతో మరియు కరెంటు అధికారులతో మాట్లాడి మీ సమస్యలు పరిష్కారం అయ్యేటట్లు చూస్తానని సిపిఐ నాయకులకు జాయింట్ కలెక్టర్ గారు హామీ ఇవ్వడం జరిగింది.

