FlatNews Buy Now
ప్రభుత్వం మెడికల్ చదువుతున్న విద్యార్థులకు తక్షణమే స్టైఫండ్ ఇవ్వాలి   

ప్రభుత్వం మెడికల్ చదువుతున్న విద్యార్థులకు తక్షణమే స్టైఫండ్ ఇవ్వాలి   

    డిఎస్ఎఫ్ డిమాండ్

న్యూస్ వెలుగు, ఆదోని; స్థానిక ఆదోని పట్టణంలో పద్మావతి కళాశాల నుండి సబ్ కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లి ధర్నా నిర్వహించడం

జరిగింది ఈ సందర్భంగా పిడిఎస్ఓ రాష్ట్ర నాయకులు తిరుమలేష్ డి.ఎస్.ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షడు దానాపురం ఉదయ్ మాట్లాడుతూ. నర్సింగ్ చదువుతున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కి స్టేఫండ్ ఇంతవరకు అందలేని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ తక్షణమే స్టేఫండ్ ఇవ్వాలని డి.ఎస్.ఎఫ్, పి.డి.ఎస్.ఓ విద్యార్థి సంఘాలుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం… అలాగే అప్రెంటిషిప్ పేరుతో ఫ్రీగా పని చేయించుకుంటూ విద్యార్థి జీవితాలతో చలగాటమాడుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం సరైన పద్ధతి కాదు… కాబట్టి తక్షణమే మెడికల్ చదువుతున్నటువంటి విద్యార్థి సమస్యలు పరిష్కారం చేయాలనే కోరుతున్నాము. కార్యక్రమంలో NYS వీరేష్ పి డిఎస్ఓ తరుణ్ లిఖిత మమత ఈరమ్మ మేఘన డిఎస్ఎఫ్ నాయకులు అమృత అశ్విని అఖిల తదితరులు పాల్గొనరు.

Author

Was this helpful?

Thanks for your feedback!