వెంకట లచ్చమ్మను ప్రభుత్వం ఆదుకోవాలి 

వెంకట లచ్చమ్మను ప్రభుత్వం ఆదుకోవాలి 

నంద్యాల, న్యూస్ వెలుగు : బండి ఆత్మకూరు మండలం సోమయాజుల పల్లె కు చెందిన భూమా వెంకట లచ్చమ్మ బుధవారం ఉపాధి పనికి పోయి ప్రమాదవశత్తు కింద పడడంతో మాట్లాడలేని స్థితిలో ఉన్న ఆమెను కూలీలు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గురువారం వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎం నరసింహ నాయక్, బండి ఆత్మకూరు మండల వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్ష కార్యదర్శులు కుళాయి స్వామి, డేవిడ్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి ఆమె ఆరోగ్య పరిస్థతిపై ఆరా తీశారు. డాక్టర్లు ఆమె ఆరోగ్యం చాలా సీరియస్ గా ఉందని అన్నారు. ఆమెకు మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వం ఆదుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS