ఆయుష్ సహాయ మంత్రి ప్రతాప్రరావు జాదవ్ రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాన్ని తెలియజేశారు. సంబంధిత విదేశీ ప్రాంతీయ రిజిస్ట్రేషన్ కార్యాలయం ఆయుష్ వీసా జారీ చేసిన తేదీ నుండి గరిష్టంగా ఐదు సంవత్సరాల వరకు వార్షిక ప్రాతిపదికన వీసాను పొడిగించవచ్చని ఆయన అన్నారు. దేశంలోని గుర్తింపు పొందిన ఆసుపత్రి నుండి వైద్య ధృవీకరణ పత్రం లేదా సలహాను సమర్పించడం ద్వారా ఇది జరుగుతుందని ఆయన అన్నారు.
అవసరమైన చికిత్స కోసం తమ ఖర్చులను తామే భరించినట్లు ఆధారాలు చూపితే విదేశీయులకు ఆయుష్ వీసా మంజూరు చేయబడుతుందని మంత్రి తెలిపారు.