
స్వయం ఉపాధి పథకాలకు దరఖాస్తుల ఆహ్వానం
జిల్లా వెనుకబడిన తరగతుల సేవా సహకార సంఘం
బిసి, ఇబిసి, కమ్మ, రెడ్డి, ఆర్య వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ మరియు కాపు(కాపు, బలిజ, తెలగ మరియు ఒంటరి) కులములకు
కర్నూలు, న్యూస్ వెలుగు; 2024-25 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బి.సి. కార్పోరేషన్, ఇబిసి, కమ్మ, రెడ్డి, ఆర్య వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ మరియు కాపు (కాపు, బలిజ, తెలగ, ఒంటరి) కార్పోరేషన్లకు సంబంధించిన లబ్దిదారులకు బిసి కార్పోరేషన్, కర్నూలు వారి ద్వారా వివిధ పథకముల ద్వారా సబ్సిడీ మంజూరు చేయుటకు దరఖాస్తుదారులు APOBMMS ద్వారా వారి పేరును online లో నమోదు చేసుకొనుటకు తేదీ 30.01.2025 నుండి 07.02.2025 వరకు అవకాశం కల్పించబడినది.
బి.సి. కార్పోరేషన్, ఇబిసి, కమ్మ, రెడ్డి, ఆర్య వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ మరియు కాపు (కాపు, బలిజ, తెలగ మరియు ఒంటరి) కార్పోరేషన్ల ద్వారా సబ్సిడీ ఋణముల మంజూరుకు నియమ నిబంధనలు :.>
21 నుండి 60 సం. ల మధ్య వయసు గలవారు బి.సి, ఇబిసి లు అర్హులు. కాపు (కాపు, బలిజ, తెలగ మరియు ఒంటరి) వారికి 21 నుండి 50 సం. ల మధ్య వయసు గలవారు అర్హులు తెల్ల రేషన్ కార్డు, కుల ధృవీకరణ పత్రం ఆధార్ కార్డు తప్పనిసరిగా కలిగి యుండవలెను. ఒక కుటుంబము యొక్క తెల్ల రేషన్ కార్డు నందు ఒక్కరు మాత్రమే లబ్ది పొందుటకు అర్హులు.వ్యవసాయ సంబంధ కార్యక్రమాలు, పరిశ్రమలు, చిన్న తరహా వ్యాపారము, సేవలు, రవాణా విభాగము వంటి సెక్టార్లకు సంబంధించిన యూనిట్లకు సబ్సిడీ మంజూరు చేయబడును.
పై తెల్పిన విధంగా అర్హతలున్న వారు https://apobmms.apcfss.in వెబ్ సైట్ (ఆన్ లైన్) నందు తేదీ తేదీ 30.01.2025 నుండి 07.02.2025 పేర్లను APOBMMS వెబ్ సైట్ నందు నమోదు చేసుకోవలసినదిగా ఇందుమూలముగా తెలియజేయడమైనది.
జిల్లా కలెక్టర్ / చైర్మన్ తరపునజిల్లా వెనుకబడిన తరగతుల సేవా సహకార సంఘం లి., కర్నూలు.