
సిపిఐ నేతలు టీజీవి కళక్షేత్రం ఎదుట ధర్నా చేయడం సరికాదు
టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పతి ఓబులయ్య
కర్నూలు, న్యూస్ వెలుగు; సీపీఐ నేతలు టీజీవీ కళాక్షేత్రం ఎదుట ధర్నా చేయడం సరికాదని కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య అన్నారు. శుక్రవారం కళాక్షేత్రంలో సీపీఐ నేతల ఆధ్వర్యంలో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా అనుకోకుండా ఓసంఘటన చోటుచేసుకొని కళాక్షేత్రం నిర్వహకులకు,సీపీఐ నేతల మద్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో శనివారం ఉదయం సీపీఐ నేతలు సీ. క్యాంపు లోని కళాక్షేత్రం ఎదుట పెద్ద ఎత్తున పత్తి ఓబులయ్య కు వ్యతిరేకంగా ధర్నా చేశారు. ఈఘటనపై టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య స్పందించారు. కళాక్షేత్రంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని అలా జరిగనట్లు రుజువు చేస్తే ఎలాంటి చర్యలకైనా సిద్ధం అన్నారు. సీపీఐ నేతలను తాను ఎలాంటి దుర్బాషలు ఆడలేదన్నారు.
నేను దుర్భాషలు మాట్లాడి ఉంటే నిరూపిస్తే క్షమాపణ కోరుతానని చెప్పారు. అలాగే కావాలంటే నేనే స్వచ్ఛందంగా ఈ పదవికి రాజీనామా చేస్తాను రాజకీయ పార్టీతో కళాక్షేత్రానికి సంబంధం లేదన్నారు. టీజీవీ కళాక్షేత్రం కేవలం కళాకారుల కోసమే ఉందన్నారు. ఇలా తప్పుడు ఆరోపణలు చేయొద్దని మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నానని పత్తి ఓబులయ్య తెలిపారు.


 Journalist Sekur Gangadhar
 Journalist Sekur Gangadhar