
26 నుంచి జనసేన పార్టీ సభ్యత్వ కార్యక్రమం
కర్నూలు న్యూస్ వెలుగు : రాష్ట్ర రాజకీయాల్లో జనసేన పార్టీ కీలకపాత్ర పోషించడమే రాష్ట్రంలో పార్టీ విస్తరణకు కాకుండా ప్రత్యేక ప్రణాళికలను రూపొందించడం జరుగుతుందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కర్నూలు జిల్లా పార్టీ ఇన్చార్జి చిలకం మధుసూదన్ రెడ్డి పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 26 నుంచి మార్చి 10 వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడం జరుగుతుందని వారు జిల్లాలో 40 వేల మందిసభ్యత్వం జరగగా 2026 లో 50 వేలకు పైగా సభ్యత్వ నమోదు చేసేందుకు పార్టీ కృషి చేయడం జరుగుతుందని వారు తెలిపారు. గతంలో పార్టీ సభ్యత్వానికి 500 రూపాయలు వసూలు చేస్తుండగా… నేడు సభ్యత్వ రుసుమును కూడా పార్టీ 400 రూపాయలకు కుదించినట్లు పేర్కొన్నారు. దీనివల్ల పార్టీలో సభ్యత్వం తీసుకోవడం వల్ల ఆ కుటుంబానికి భరోసా ఉంటుందని వారు తెలిపారు. పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి ఐదు లక్షల రూపాయల వరకు ప్రమాద బీమా ఉంటుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు చింత సురేష్ బాబు, శాలివాహన సంఘం డైరెక్టర్ పివి సుబ్బయ్య శ్రీశైలం దేవస్థానం సభ్యులు రేఖ గౌడ్ సహా తదితరులు పాల్గొన్నారు

