FlatNews Buy Now

ఫోక్సో కేసు కు ఎం. పి. కి ఎలాంటి సంబంధం లేదు….కర్నూలు జిల్లా కురువ సంఘం

కర్నూలు, న్యూస్ వెలుగు;   గూడూరు మండలం పొన్నకల్ గ్రామం బోయ యువకుల పై పెట్టిన ఫోక్సో కేసు విషయంలో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు కు ఎలాంటి సంబంధం లేదని , కర్నూలు జిల్లా కురువ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పత్తికొండ శ్రీనివాసులు, ఏం. కే.రంగస్వామి, అసోసియేట్ అధ్యక్షులు గుడిసె శివన్న, జిల్లా కోశాధికారి కె. సి. నాగన్న,జిల్లా ఉపాధ్యక్షులు కత్తి శంకర్, బి. వెంకటేశ్వర్లు, టి. ఉరుకుందు, కె ధనుంజయ, పుల్లన్న, తిరుపాల్, బాలరాజు, నగర అధ్యక్షులు తవుడు శ్రీనివాసులు ఒక ప్రకటన లో తీవ్రంగా ఖండించారు.గూడూరు మండలం పొన్నకల్లు గ్రామం నకు చెందిన మైనర్ బాలికకు జరిగిన అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని మరియు భాదితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులపై పోలీసు వారు చట్ట ప్రకారం ఫో క్సో కేసు నమోదు చేసారు కాని ఎక్కడ ఎం. పి ప్రమేయం ఏమి లేదని కేసును పక్కదారి పట్టించడానికి వాల్మీకులు ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదన్నారు. పొన్నకల్లు గ్రామంలో రెండు కుటుంబాల మధ్య జరిగినటువంటి విషయంలో ఎంపీ బస్తిపాటి నాగరాజు ఎలాంటి సంబంధం లేదని  వాపోయారు.

Author

Was this helpful?

Thanks for your feedback!