
పి.జి. మూడవ సెమిస్టర్ పరీక్షలను వర్సిటీ వైస్‌ఛాన్స్‌లర్
కర్నూలు, న్యూస్ వెలుగు; రాయలసీమ యూనివర్సిటీ కాలేజీతోపాటు అనుబంధ కాలేజీల్లో కొనసాగుతున్న పి.జి. మూడవ సెమిస్టర్ పరీక్షలను వర్సిటీ వైస్‌ఛాన్స్‌లర్ ఆచార్య వి. వెంకట బసవరావు పరిశీలించారు. నందికొట్కూరులోని బసిరెడ్డి మెమోరియల్ కాలేజీలో పి.జి. పరీక్షలు జరుగుతున్న విధానాన్ని వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్లుతో కలిసి గమనించారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా పరీక్షలు నిర్వహించాల్సిందిగా సంబంధింత యాజమాన్యానికి సూచించారు. గురువారం ఉదయం జరిగిన పరీక్షలకు మొత్తం 495 మంది రిజిస్టర్ చేసుకోగా అందులో 465 మంది హాజరయ్యారు.
Was this helpful?
Thanks for your feedback!

