
విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు చర్యలు అవసరం
కొత్తూరు సత్యం
కర్నూలు న్యూస్ వెలుగు; భారతదేశంలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం సరికాదని అందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జనతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు కొత్తూరు సత్యనారాయణ గుప్తా కోరారు . బుధవారం విలేకరులతో మాట్లాడుతూ విద్యార్థులు మానసిక ఒత్తిళ్లకు గురై తాము అనుకున్న లక్ష్యాన్ని సాధించలేమన్న భావనతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతి జిల్లాలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని, దీనివల్ల విద్యార్థుల ఆత్మహత్యలకు చేసుకోవాలన్న ఆలోచన ఉండకుండా ఉపయోగపడుతుందన్నారు. పాఠశాలలో , కాలేజీల్లో విద్యార్థులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని ఫలితాలు రేపటి తరానికి బాటగా అవుతుందన్నారు. భారతదేశంలో ఒకవైపు రైతులు ఇంకోవైపు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతున్నదని ఆయన తెలిపారు. కొంతమంది విద్యార్థుల్లో మానసికంగా కృంగిపోయి తాము ఏమి చేసుకుంటున్నాము ఏమి చేస్తున్నామో అర్థం కాని దుస్థితిలో ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా సంస్థలు కేవలం పాఠాలు బోధించడమే కాకుండా ఆత్మహత్యల నివారణ పట్ల అవగాహన కలిగించే చర్యలు యాజమాన్యాలు కూడా తీసుకోవాలని ఆయన కోరారు. ర్యాంకుల పేరుతో పలు విద్యాసంస్థలు మానసిక ఒత్తిళ్లకు గురిచేసి మానసిక రోగిగా మార్చే విధానాలకు పోవడం మానుకోవాలని, ప్రతి విద్యార్థికి విద్య ఎంతో అవసరమని ఆ విద్యలో మెలకువలు నేర్పిస్తే ఆత్మహత్యలు చేసుకోవాలన్న ఆలోచన కూడా ఉండదన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రతి జిల్లాలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లా యంత్రాంగం జనతా ఫౌండేషన్కు అవకాశం ఇస్తే విద్యార్థుల్లో అవగాహన కలిగించేందుకు ముందు ఉంటామని తెలిపారు.


 Journalist Sekur Gangadhar
 Journalist Sekur Gangadhar