
నయన నందకరంగా ముగ్గుల పోటీలు
పోటీలను ప్రారంభించిన టీజీ. రాజ్యలక్ష్మి
కర్నూలు, న్యూస్ వెలుగు; స్థానిక స్పోర్ట్స్ అథారిటీ అవుట్డోర్ స్టేడియంలో సోమవారం డి.వి.ఆర్.బ్రాడ్బ్యాండ్ ఆధ్వర్యంలో టీజీవీబీ 
అనంతరం డివిఆర్ బ్రాడ్ బ్యాండ్ అధినేత డి.వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ పండుగల ప్రాముఖ్యత రాబోయే తరాల వారు తెలుసుకునే విధంగా సాంప్రదాయం ఉట్టిపడే విధంగా పోటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోటీల్లో నెగ్గిన వారికి ఓపెన్ ప్లాట్, ఎలక్ట్రికల్ స్కూటీ, సోఫా సెట్టు సారీస్ లతో పాటు కన్సోలేషన్ బహుమతులు, పాల్గొన్న వెయ్యి మందికి రైస్ కుక్కర్లు అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ పోటీలకు సహకరించిన కో స్పాన్సర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈనెల 15వ తేదీన ఇదే స్టేడియంలో జబర్దస్త్ సినీ యాంకర్ తో డాన్సర్ల , కల్చరల్ ప్రోగ్రామ్లతో నగర ప్రజలను అలరించేందుకు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
కార్యక్రమంలో ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు మహేష్ వెంకటేశ్వర్ రెడ్డి రామాంజనేయులు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


 Journalist Sekur Gangadhar
 Journalist Sekur Gangadhar