
జాతీయ క్రీడలకు ఒలంపిక్ సంఘం నేత
కర్నూలు, న్యూస్ వెలుగు; ఈనెల 28 నుంచి వారం రోజులపాటు జరిగే 38వ జాతీయ క్రీడలకు జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు బి. రామాంజనేయులు రగ్బీ ఇండియా తరఫున అఫీషియల్ గా వెళ్ళ నున్నట్లు చెప్పారు.
ఈనెల 28న డెహ్రాడూన్ లో జరిగే జాతీయ క్రీడల ప్రారంభత్సవాన్ని వీక్షించి అనంతరం వివిధ క్రీడాంశాల్లో జరిగే పోటీలను పరిశీలించనున్నట్లు చెప్పారు.
రామాంజనేయులు జాతీయ క్రీడలకు వెళ్లటం పట్ల జిల్లా క్రీడా సంఘ అధ్యక్ష కార్యదర్శులు హర్షవర్ధన్ (అథ్లెటిక్స్), షేక్షావలి (వెయిట్ లిఫ్టింగ్), గంగాధర్ (సాఫ్ట్బాల్) ఎం ఎండి భాష (రైఫిల్ షూటింగ్), నాగరత్నమయ్య (ఆర్చరీ) శ్రీనివాసులు (హ్యాండ్ బాల్), గుడిపల్లి సురేంద్ర (రగ్బీ), దాసరి సుధీర్ (హాకీ), పరుశరాముడు (షూటింగ్ బాల్), వెంకటేశ్వర్లు (తైక్వాండో), నవీన్ (సాఫ్ట్ టెన్నిస్) వేణుగోపాల్ (పవర్ లిఫ్టింగ్), కోలా ప్రతాప్ (కరాటే ) చిన్న సుంకన్న ప్రైవేటు సంఘం ,మున్నా, (వాలీబాల్), నాగేశ్వరరావు (నెట్బాల్), తదితరులు హర్షం వ్యక్తం చేశారు.