
లక్ష సాధన కోసం కృషి చేయాలి
అనంతపురం , న్యూస్ వెలుగు : గవర్నమెంట్ డిగ్రీ ఆర్ట్స్ కాలేజ్ జువాలజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు మోటివేషనల్ అవగాహన సదస్సును నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ పరమేష్ నాయక్ ని ఆహ్వానించడం జరిగింది. ఈ అవగాహన సదస్సులు డాక్టర్ పరమేష్ నాయక్ మాట్లాడుతూ విద్యార్థులు నిత్యజీవితంలో కష్టాలను అధిగమించి ప్రతి విద్యార్థి తమ జీవితంలో గోల్స్ ను పెట్టుకొని వాటిని సాధించడానికి విద్యార్థులు ఆ దిశగా ఎన్ని కష్టాలు ఎదురైనా వాటిని అధిగమించి సహనముతో ఓర్పుతో వారు పెట్టుకున్న గోల్స్ కోసం కృషి చేయాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న డిజిటల్ యుగంలో విద్యార్థులు సమయాన్ని వృధా చేసుకోకుండా చెడు వ్యసనాలకు లోను కాకుండా తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని గుర్తించి, పెద్దలు గురువులు పట్ల వినయంగా ఉంటూ జీవితంలో ఒక ఉన్నత స్థాయికి విద్యార్థులు ఎదగాలని వారికి సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ జువాలజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ముఖ్యఅతిథిగా వచ్చిన మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ పరమేష్ నాయక్ ని శాలువాతో సిబ్బంది సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి పద్మశ్రీ , హెచ్వోడి డాక్టర్ జి రాజశేఖర్ , లెక్చరర్స్ జి ఎల్ ఎన్ ప్రసాద్ , డాక్టర్ బి శ్రీదేవి , ఎస్సీ అహ్మద్ , డాక్టర్ జి గిరిధర్ విద్యార్థిని విద్యార్థులు డిపార్ట్మెంట్ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.


