
కేజీబీవీ లో అప్లై చేసిన ప్రతి విద్యార్థికి సీటు కేటాయించాలి
ప్రతి మండలం మరొక కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలను ఏర్పాటు చేయాలి
జిల్లా జాయింట్ కలెక్టర్ నూరల్ ఖమర్ కు వినతి పత్రం సమర్పించిన రాయలసీమ రవికుమార్,రాష్ట్ర అధ్యక్షులు,ఆర్వీపీఎస్
కర్నూలు , న్యూస్ వెలుగు: కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో అప్లై చేసుకున్న ప్రతి విద్యార్థినికి సీటును కేటాయించాలని రాయలసీమ విద్యార్థి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రాయలసీమ రవికుమార్ సమితి నాయకులు కే.రాము నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు,ఈ సందర్భంగా రాయలసీమ రవికుమార్ మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో సరైన నీటి ప్రాజెక్టులు లేకపోవడంతో కరువు,వలసలు అధికంగా ఉన్నాయని జిల్లా వ్యాప్తంగా ప్రజలు వలసలు వెళుతుండడం వలన చదువుకునే పిల్లలను సైతం చదువులను మధ్యలో ఆపీవేయించి తల్లిదండ్రుల వెంట సుగ్గికి తీసుకువెళ్తున్నారని గ్రామీణ ప్రాంతాలకు చెందిన కొందరు తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రభుత్వ వసతి గృహాలలో ఉంచి చదివించుకోవాలని ఉద్దేశంతో కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో సీట్ల కొరకు అప్లై చేసినా కూడా చాలామంది విద్యార్థినిలకు సీట్లు రాకపోవడంతో వారు తల్లిదండ్రులతో పాటు వలసలకు వెళుతూ చదువుకు దూరమవుతున్నారని కావున కేజీబీవీల్లో అప్లై చేసిన ప్రతి విద్యార్థినికి సీటును కేటాయించాలని అలాగే రాయలసీమ వ్యాప్తంగా మండలానికి మరొకటి చొప్పున కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలను ఏర్పాటు చేసి కరువు వలసలతో అల్లాడుతున్న రాయలసీమ ప్రాంతంలో అమ్మాయిలను చదువుకు దూరం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వారు తెలిపారు.ఈ విషయంపై జాయింట్ కలెక్టర్ నూరల్ ఖమర్ ఈ విషయాన్ని పై అధికారులు మరియు ప్రభుత్వం దృష్టికి తీసుకువెలతామని హామీ ఇచ్చారు అన్నారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ విద్యార్థి పోరాట సమితి నాయకులు సురేష్, మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

