తుగ్గలిలో పోషణ పక్వాడ కార్యక్రమం

తుగ్గలిలో పోషణ పక్వాడ కార్యక్రమం

 సిడిపిఓ లలిత

తుగ్గలి, న్యూస్ వెలుగు; తుగ్గలి మండలంలోని తుగ్గలి అంగన్వాడి సెంటర్లో పోషణ పక్వాడ కార్యక్రమం బుధవారం సిడిపిఓ లలిత నేతృత్వంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సిడిపిఓ లలిత మాట్లాడుతూ పోషణ పక్వాడ కార్యక్రమంలో భాగంగా ఈ ఏప్రిల్ నెలలో 15 రోజుల వరకు జరుగుతాయని తెలిపారు. అలాగే గర్భవతులు బాలింతలు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, అందులో ధీమ్ లో భాగంగా 0 నుంచి 3 సంవత్సరాల పిల్లలలో మెదడు అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది దానికోసం మనము తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి పిల్లలకు ఎటువంటి ఆహారం పెట్టడం వల్ల వారు బలంగా ఉంటారు ఎటువంటి కార్యక్రమాలు, ఎటువంటి ఆటపాటలు చేయడం వల్ల పిల్లలలో మేదో శక్తి అభివృద్ధి జరుగుతుంది అన్న అంశాలపై లబ్ధిదారులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు అంబికా, త్రివేణి, మహిళా పోలీస్ లక్ష్మి, ఏఎన్ఎం పద్మావతి, అంగన్వాడీ టీచర్లు కాంతమ్మ, రంజాని, జయ, జ్యోతి, హెల్పర్ సునీత తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS