ఘనంగా ప్రియాంక గాంధీ బర్త్ డే వేడుకలు

ఘనంగా ప్రియాంక గాంధీ బర్త్ డే వేడుకలు

  ఇందిరాగాంధీ ప్రతిరూపమే ప్రియాంక గాంధీ

కర్నూలు, న్యూస్ వెలుగు; భారత మాజీ ప్రధానమంత్రి, ఉక్కు మహిళ, భారతరత్న శ్రీమతి ఇందిరా గాంధీ ప్రతిరూపమే ప్రియాంక గాంధీ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే, టిటిడి బోర్డు మాజీ సభ్యులు పరిగెల మురళీకృష్ణ అభిప్రాయ పడ్డారు. ఆదివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన ప్రియాంక గాంధీ బర్త్ డే వేడుకల్లో పాల్గొని నాయకులు కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మురళీకృష్ణ గారు మాట్లాడుతూ చిన్నతనంలోనే నానమ్మ ఇందిరా గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ కోల్పోయిన మనో ధైర్యంతో జాతీయ కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా భరోసానిస్తూ అధికార బిజెపి ఎన్ని కష్టాలు పెట్టినా రాజకీయంగా ఎదుర్కొంటూ మంచి వాక్చాతుర్యము ప్రియాంక గాంధీ భవిష్యత్తు ఉందని భవిష్యత్తులో ఆమె అత్యున్నత పదవులు చేపడతారని, చేపట్టాలని కోరుచున్నామని మురళీకృష్ణ గారు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఎం సుధాకర్ బాబు జిల్లా కాంగ్రెస్ ఓబీసీ చైర్మన్ డివి సాంబశివుడు మాజీ కార్పొరేటర్ ఎం శివానంద్ కాంగ్రెస్ నాయకులు షేక్ ఖాజా హుస్సేన్, ఎస్ ప్రమీల, సయ్యద్ నవీద్ ఈ లాజరస్ ఆమన్ ఐఎన్టియుసి ప్రధాన కార్యదర్శి ఎన్ సుంకన్న బి సుబ్రహ్మణ్యం జాన్ సదానందం ఆర్ ప్రతాప్ రమేష్ నాగన్న రంగస్వామి మహిళా కాంగ్రెస్ మల్లేశ్వరి శ్రీలత మొదలగు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!