తుగ్గలి న్యూస్ వెలుగు:

పత్తికొండ వ్యవసాయ మార్కెట్ యార్డ్ నూతన డైరెక్టర్ గా తుగ్గలి గ్రామానికి చెందిన రంగ శాలివాహన్ ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే కే.ఈ శ్యాం బాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పత్తికొండ వ్యవసాయ మార్కెట్ యార్డ్ నూతన పాలకవర్గ కమిటీలో తుగ్గలి రంగాకు చోటు దక్కింది. ఈ సందర్భంగా రంగ శాలివాహన్ మాట్లాడుతూ తనకు ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు, పత్తికొండ నియోజకవర్గం శాసనసభ్యులు కేఈ శాంబాబుకు మరియు టిడిపి రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి తుగ్గలి నాగేంద్రకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.పాలకవర్గం నందు యువతకు చోటు కల్పించినందుకు పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలియజేశారు.తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించినందుకు పార్టీ అభివృద్ధి కొరకు మరియు పత్తికొండ మార్కెట్ యార్డ్ అభివృద్ధి కొరకు తన వంతు కృషి చేస్తానని ఆయన తెలియజేశారు.ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు సాంబశివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Thanks for your feedback!