భూ సమస్యల పరిష్కారం కొరకే రెవెన్యూ సదస్సులు
తహసిల్దార్ రమాదేవి
తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: ప్రజల భూ సమస్యల పరిష్కారం కొరకే రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నట్లు తుగ్గలి తహసిల్దార్ రమాదేవి తెలియజేశారు. మంగళవారం రోజున తుగ్గలి మండల పరిధిలోని గల ముక్కెల్ల గ్రామంలో స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సచివాలయం సిబ్బంది నేతృత్వంలో ఎమ్మార్వో రమాదేవి,గ్రామ సర్పంచ్ సుజాత, సర్పంచ్ సలహా దారులు రామచంద్ర ఆద్వర్యంలో గ్రామ రెవెన్యూ సదస్సును నిర్వహించారు.ఈ సందర్భంగా ముక్కెళ్ల గ్రామ సర్పంచ్ గౌరవ సలహాదారులు రామచంద్ర,గ్రామ టిడిపి ముఖ్య నాయకులు బుల్లేని బొజ్జన్న ఇద్దరు సంయుక్తంగా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ లు రాష్ట్ర
ప్రజల యొక్కభూమి రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసమే గ్రామాలలోని గ్రామ సచివాలయాలలో పత్తికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే కెయి శ్యామ్ కుమార్ ఆదేశాల మేరకు మండల రెవెన్యూ అధికారుల సమక్షంలో గ్రామ రెవెన్యూ సదస్సును నిర్వహించడం జరిగిందని,ప్రజల యొక్క భూమి సమస్యలను ఆన్లైన్ లో పరిష్కరించుకునే అవకాశం గ్రామాలలో ఏర్పాటు చేయడం సంతోషమని, అదేవిధంగా గ్రామంలోని దళితులకు సంబంధించిన స్మశాన వాటికకు సరైన దారి మార్గం లేనందున స్మశాన వాటికకు వెళ్ళడానికి దారికి మార్గం ఏర్పాటు చేయాలని రెవెన్యూ అధికారులు చేయాలని గ్రామ సర్పంచ్ గౌరవసలహా దారులు రామచంద్ర,టిడిపి సీనియర్ నాయకులు బుల్లేని బొజ్జన్నలు తెలియజేశారుఈ కార్యక్రమంలో మండల డిప్యూటీ తహశీల్దార్ నాగరాజు,మండల సర్వేయర్ సుధాకర్, గ్రామ వీఆర్వోలు అధికారులు రెహమాన్,రంగప్ప,ముక్కెళ్ళ మరియు మారెళ్ల గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.