ప్రభుత్వ సర్వజన వైద్యశాల సదరంపై సమీక్ష సమావేశం
న్యూస్ వెలుగు, కర్నూలు హాస్పిటల్; కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో గురువారం సూపరింటెండెంట్ ఛాంబర్‌లో సదరం కి సంబంధించిన సమావేశానికి పలు విభాగాల హెచ్ ఓ డి లైన న్యూరో సర్జరీ, న్యూరాలజీ, సైకియాట్రి, ఆర్థోపెడిక్స్, ఈఎన్ టి మరియు సదరం సిబ్బంది తో సదరంకి సంబంధించిన పలు అంశాలపై సదరంక్యాంప్, రికార్డులు, రిజిస్ట్రేషన్ సంబంధిత వివరాలు మరియు పెండింగ్‌లో ఉన్న జాబితాపై సమీక్ష సమావేశం ఆసుపత్రి సదరంపై అప్రూవల్ అయిన కేసులు , పెండింగ్ కేసులు మరియు ఇతర కేసులపై ఆరా తీశారు అనంతరం ఏవైనా పెండింగ్ ఉంటే దాన్ని త్వరగా పూర్తి చేయాలని సదరం సిబ్బందికి ఆదేశించారు.
అంగవైకల్యం లేని దరఖాస్తుదారులకు నకిలీ సదరం సర్టిఫికేట్లు జారీ చేసినందుకు లేదా సదరం సర్టిఫికేట్లలో వైకల్యం శాతాన్ని పెంచినందుకు వైద్యులు, ఇతర ఉద్యోగులపై ఫిర్యాదులు ఎవరైనా చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
సదరంపై ఎవరైనా అవినీతికి పాల్పడినట్లైతే బాధ్యులైన వైద్యులు/ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.సదరం సర్టిఫికెట్ల జారీలో పాల్గొన్న వైద్యులతో సహా ఉద్యోగులందరూ వైకల్య ధృవీకరణ పత్రాలను ప్రాసెస్ చేయడంలో మరింత జాగ్రత్తగా మరియు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
ఈ కార్యక్రమానికి డిప్యూటీ సూపరింటెండెంలు, డా.శ్రీరాములు, సిఎస్ఆర్ఎంఓ, డా.వెంకటేశ్వరరావు, ఆర్తో హెచ్వైడి, డా.శ్రీనివాసులు, న్యూరాలజీ హెచ్ ఓ డి,
డా.శ్రీనివాసులు, సైకియాట్రి హెచ్ ఓ డి డా.నాగేశ్వరరావు, న్యూరో సర్జరీ ఇన్చార్జ్ హెచ్ ఓ డి, డా.రామ్ బాలాజీ నాయక్, ఈ ఎన్ టి హెచ్ ఓ డి, డా.వీర కుమార్, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నరు..