
ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలి
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పి మురళీకృష్ణ
కర్నూలు, న్యూస్ వెలుగు; ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, కోడుమూరు మాజీ ఎమ్మెల్యే టీటీడీ బోర్డు మాజీ సభ్యులు పి మురళీకృష్ణ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన ఎస్సీ వర్గీకరణ దేశానికే ఆదర్శమని ఇదోక సాహసోపేతమైన చారిత్రాత్మక ఘట్టమని ఈ సర్వే యావత్ భారతావనికి దిక్సూచిగా నిలుస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గారికి మురళీ కృష్ణ గారు కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున అభినందనలు తెలియజేశారు. బుధవారం కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి విడుదల చేసిన పత్రికా ప్రకటనలో మురళీ కృష్ణ మాట్లాడుతూ తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలుకు తెలంగాణ ప్రభుత్వం, చట్టసభలు పచ్చ జెండా ఉపాయని సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ షమీం అక్తర్ ఏకసభ్య కమిషన్ 4 సిఫార్సులు చేసిందని వాటిలో రాష్ట్రంలోని మొత్తం 59 ఎస్సీ కులాలను మూడు గ్రూపులుగా వర్గీకరించడం, ఉద్యోగాల భర్తీ విధానం రోస్టర్ పాయింట్ల విభజన ప్రతిపాదనలను తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదించిందని, క్రిమిలేయర్ సిఫారసును తిరస్కరించిందని, మంత్రిమండలి ఆమోదించిన అనంతరం సంబంధిత నివేదికను శాసనసభ, శాసనమండలిలో మంగళవారం ప్రవేశపెట్టిందని జస్టిస్ షమీం అక్తర్ కమిషన్ సామాజిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగాలు రాజకీయాల్లో ప్రాతినిథ్యం ఆధారంగా అత్యంత వెనుకబడిన కులాలను గ్రూప్ వన్ లో, మద్యస్థ లబ్దిపొందిన కులాలను గ్రూప్2లో, మెరుగైన ప్రయోజనాలు పొందిన కులాలను గ్రూప్ త్రీ లో చేర్చిందని మురళీ కృష్ణ తెలియజేశారు. దేశ భవిష్యత్ కోసం రాహుల్ గాంధీ గారి దూరదృష్టికి ఇదొక నిదర్శనమనీ ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినందుకు దేశానికే ఆదర్శంగా మనం భావించాలని ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు, చొరవ తీసుకొని ఆంధ్రప్రదేశ్లో కూడా చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని మురళీకృష్ణ తెలియజేశారు.