
రెవెన్యూ సదస్సులతో భూ సమస్యలకు పరిష్కారం
బండి ఆత్మకూరు నూతన తహాసిల్దారు పద్మావతి
బండి ఆత్మకూరు, న్యూస్ వెలుగు: గ్రామ రెవెన్యూ సదస్సుల ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని బండి ఆత్మకూరు మండల నూతన తహసిల్దారు పద్మావతి తెలిపారు. బండి ఆత్మకూరు తహసిల్దారుగా గురువారం బాధ్యతలు చేపట్టిన పద్మావతికి స్థానిక కార్యాలయ సిబ్బంది స్వాగతం పలికారు. అనంతరం రెవెన్యూ సిబ్బందితో సమావేశం నిర్వహించిన తహసిల్దారు మాట్లాడుతూ గ్రామాలలో నేటి నుంచి జరగబోయే సదస్సులను విజయవంతం చేయాలని సూచించారు. సదస్సులలో రైతుల నుండి వచ్చిన భూ సమస్యలను ఆర్జీల రూపంలో స్వీకరించి శాశ్వత పరిష్కారం చూపించేలా చర్యలు తీసుకోవాలన్నారు.నేడు బండి ఆత్మకూరు సచివాలయం -1 లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తహసిల్దార్ తెలిపారు.నూతనంగా బాధ్యతలు స్వీకరించిన తహసిల్దార్ అన్నమయ్య జిల్లా మదనపల్లి ఆర్డీవో కార్యాలయంలో ఏవోగా విధులు నిర్వహిస్తూ నంద్యాల జిల్లాకి బదిలీపై వచ్చారు. నంద్యాల జిల్లా నుండి బండి ఆత్మకూరు మండల తహసిల్దార్ గా జిల్లా కలెక్టర్ నియమించడంతో గురువారం ఆమె బాధ్యతను స్వీకరించారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న తహసిల్దార్ ఆల్ఫ్రెడ్ నేషనల్ హైవే తాసిల్దారుగా బదిలీ అయినట్లు కార్యాలయ సిబ్బంది తెలిపారు.