దళిత కాలనీలలో శ్రీ వేంకటేశ్వర స్వామి హోమం, సహస్రనామార్చన
కర్నూలు, న్యూస్ వెలుగు; శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానం, పొన్నాపురం గ్రామం, నంద్యాల రూరల్ నుండి. నేడు ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా నాలుగు కేంద్రాలలో మంగళ కైసిక ద్వాదశి వేడుకలుగోవిందుడు అందరివాడు అని తెలుపుటకే మంగళకైశిక ద్వాదశి వేడుకలు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి, తితిదే భగవంతుడు జాతి, కుల, మత, వర్ణ, వర్గ, లింగ, ప్రాంత భేదాలకు అతీతుడని, ఆయన భక్త సులభుడని, నిర్మలమైన హృదయం ఎక్కడ ఉంటుందో అక్కడ ఉంటాడని తెలుపుటకే తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో మంగళకైశిక ద్వాదశి వేడుకలు నిర్వహిస్తున్నదని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి తెలిపారు. ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా నంద్యాల మండలం పొన్నాపురం, ఆళ్ళగడ్డ ఎస్సీ కాలనీ, గూడూరు ఎస్సీ కాలనీ, కల్లూరు మండలం పర్ల లోని ఎస్సీ కాలనీలలో బుధవారం ఉదయం 9 గంటల నుండి శ్రీ వేంకటేశ్వర స్వామి హోమం, సహస్రనామార్చన, నామ సంకీర్తన, మాల దాసరి వృత్తాంతం కధాగానం, భక్తులందరికీ తీర్ధ ప్రసాద వినియోగం మొదలైన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.