శ్రీశైలం నీటి ముంపు బాధితులు రీలే నిరాహార దీక్షలు

శ్రీశైలం నీటి ముంపు బాధితులు రీలే నిరాహార దీక్షలు

నంద్యాల, న్యూస్ వెలుగు  : నందికొట్కూరు పట్టణంలో శ్రీశైలం ముంపు బాధితులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. శ్రీశైలం ముంపు బాధితులకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. ముంపు బాధితులు జయన్న, కొండా దరగయ్య, వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. శ్రీశైలం నీటి ముంపు నిరుద్యోగ నిర్వాసితులకు సంబంధించిన జీవో నెంబర్ 98 ప్రకారం ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలని ఆనాటి ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 1982, 1986 ప్రాంతంలో జీవో తీసుకొని రావడం జరిగిందన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో దాదాపు 116 గ్రామాలు నీటి ముంపు కు గురి అయ్యాయి. అయితే 2014 సంవత్సరం లో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి 98 జీవో ప్రకారం కేవలం 965 మందికి తాత్కాలిక ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది.
అయితే మిగిలి వున్న 674 మంది 2019 సెప్టెంబర్ 9 వ తేది నుంచి డిసెంబర్ 19 2019. సంవత్సరం వరకు 102 రోజుల పాటు రీలే నిరాహార దీక్ష చేయడం జరిగింది ఈ సందర్భంలో ఒక నాయకుడు అసత్య ప్రచారం తో ఆనాటి స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ ద్వారా రీలే నిరాహార దీక్ష కు నిమ్మరసం ఇప్పించి మీకు సంబంధించిన లీస్ట్ ఫైనాన్స్ అప్రూవల్ అయింది అని మోసం చేయడం జరిగింది.
దాని తర్వాత 2024 ఎలక్షన్స్ ప్రచారం లో బాగంగా ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నందికొట్కూరు వల్లా భాయ్ పటేల్ సెంటర్ లో మేము అదికారం లోకి వచ్చిన వెంటనే 98 జీవో ప్రకారం వారికి ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చారు. అదే విధంగా నంద్యాల పార్లమెంటు ఇంచార్జీ మాండ్ర శివానందరెడ్డి కూడా యువగళం పాదయాత్ర లో బాగంగా నందికొట్కూరు తాలుకా లో టిడిపి పార్టీ ని గెలిపిస్తే మిగిలిన వున్న 98 జీవో వారికి ఉద్యోగాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు కాని అధికారం లోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇంతవరకు మాకు ఉద్యోగాలు ఇప్పించలేదన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని వాపోయారు. మాకు న్యాయం జరగక పోవడంతో మార్చి 26 గురువారం నుండి మరల రిలే నిరాహారదీక్షలు మొదలు పెట్టినామని తెలిపారు. ఇప్పటికైన కూటమి ప్రభుత్వం స్పందించి మాకు సంబంధించిన లీస్ట్ ను ఫైనాన్స్ అప్రూవల్ చేయించే వరకు ఈ రీలే నిరాహార దీక్ష కొనసాగించడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో కొండా దరగయ్య, జయన్న, వెంకట్రామిరెడ్డి, రాజు , రాముడు, కిరణ్, జిరాక్స్ రాజు, లింగమయ్య, మహేశ్వర రెడ్డి, మురలి, జంబన్న, బిచ్చన్న, నాగలక్మయ్య, తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS