
కనకదాసు విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి
తుగ్గలి (న్యూస్ వెలుగు): కర్నూలు జిల్లాలోని ఆలూరు నియోజకవర్గంలో మనేకృతి గ్రామంలో గురువారం రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కనకదాసు విగ్రహంపై ధ్వంసం చేశారని, ఇది సరైన పద్ధతి కాదని మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బత్తిన వెంకటరాముడు అన్నారు.ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ విగ్రహం ధ్వంసం చేసిన వ్యక్తులను తక్షణమే అరెస్టు చేయాలని, ఈ విగ్రహ ధ్వంసం విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తానని ఆయన అన్నారు.ఈ విషయంపై జిల్లా ఎస్పీ తక్షణమే జోక్యం చేసుకునే విగ్రహం ధ్వంసం చేసిన వ్యక్తులను తక్షణమే అరెస్టు చేయాలని ఆయన అన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా భక్త కనకదాసుకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉందని,అలాంటి కుల దైవం అయినటువంటి కనకదాసు విగ్రహం ధ్వంసం చేయడం చాలా ఘోరమని ఆయన తెలియజేశారు.కనకదాసు విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను, వెంటనే పోలీసులు గుర్తించి అలాంటి వారిని తక్షణమే చర్యలు తీసుకొని శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.విగ్రహం ధ్వంసం చేసిన వాళ్ళనీ శిక్షించడమే కాక,వారిచే ఆ స్థానంలో నూతన విగ్రహాన్ని చేపట్టేలాగా తీసుకోవాలని పోలీసు అధికారులకు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయకులు బత్తిన కిరణ్,బత్తిన దేవేంద్ర, కురువ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
