నారాయణ స్కూల్ ముందు ఆందోళనకు దిగిన విద్యార్థి సంఘాలు

నారాయణ స్కూల్ ముందు ఆందోళనకు దిగిన విద్యార్థి సంఘాలు

కర్నూలు న్యూస్ వెలుగు : కర్నూలు ఎలుకూరు బంగ్లా నారాయణ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ బ్రాంచ్ లో 9వ తరగతి చదువుతున్న రామ్ చరణ్ అనే విద్యార్థి పై ప్రైవేటు పార్ట్స్ పై దాడి జరిగితే.. విద్యార్థి తల్లిదండ్రులకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం బాధాకరమని విద్యార్థి సంఘాల నాయకులు రమణ మీడియా కు తెలిపారు. నారాయణ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనకు దిగి నారాయణ స్కూల్ కు వ్యతిరేకంగా నిరసనలు చేస్తూ.. నారాయణ స్కూల్ గుర్తింపును వెంటనే రద్దు చేయాలనీ, బాద్యులైన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలనీ విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు… ఎస్ ఐ శరత్ కుమార్ రెడ్ది తో వాగ్వదానికి విద్యార్థి సంఘాల నాయకులు దిగడం తో కొంతసేపు స్కూల్ దగ్గర ఆందోళన కర వాతావరణం నెల్కొంది. మార్చి ఎనిమిది, శుక్రవారం ఘటన జరిగితే ఆదివారం తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారాని, తల్లిదండ్రులు వచ్చి విద్యార్థిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చగా విద్యార్థి భీజానికి ఆపరేషన్ జరిగినట్లు బుధవారం తల్లి దండ్రులు మీడియా కు వెల్లడించారు. నారాయణ స్కులు AGM రమేష్ సైతం విద్యార్థి సంఘాలతో వాగ్వదాం జరగగా విద్యార్థికి RMP తో వైద్యం ఎలా చేపిస్తారని వారిని ప్రశ్నించారు. నారాయణ స్కులు యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి కళ్ళకు కట్టినట్లు కనిపించడం జరిగిందని, SFI సాయి ఉదయ్ ఆరోపించారు. లక్షల రూపాయలు విద్యార్థుల తల్లిదండ్రులు కట్టి చదివిస్తున్న విద్యార్థులకు ఎలాంటి భద్రత కల్పించకపోవడం నారాయణ స్కూల్ యాజమాన్య నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుందని, విద్యార్థి సంఘాల నాయకులు అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో

AISA రాష్ట్ర కార్యదర్శి నాగార్జున, SFI జిల్లా అధ్యక్షులు సాయి ఉదయ్, PDSU జిల్లా ఉపాధ్యక్షులు రమణ, AISF నగర అధ్యక్ష కార్యదర్శులు అభి, అశోక్, RPSF రాష్ట్ర నాయకులు నాగరాజు, వైస్సార్సీపీ విద్యార్థి సంఘం నాయకులు సాయి, బీసీ విద్యార్థి సంఘం నాయకులు గిరీష్ సహా తదితరులు పాల్గొన్నారు.

 

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS