FlatNews Buy Now
విద్యార్థులు లక్ష్యసాధన కోసం కృషి చేయాలి

విద్యార్థులు లక్ష్యసాధన కోసం కృషి చేయాలి

కష్టాలను అధిగమించినప్పుడే విజయాలు

మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ పరమేష్ నాయక్

అనంతపురం, న్యూస్ వెలుగు : విద్యార్థి దశలో ఉన్నప్పుడు కాలేజీ జీవితం విద్యార్థినీ విద్యార్థులకు ఎంతో కీలకమని మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ పరమేష్ నాయక్ అన్నారు. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలోని లోహిత్ ట్రైనింగ్ సొల్యూషన్ సెంటర్ ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం ఏర్పాటుచేసిన మోటివేషనల్ అవగాహన సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొని డాక్టర్ పరమేష్ నాయక్ మాట్లాడడం జరిగింది. కాలేజీ జీవితంలోనే విద్యార్థులకు తమ జీవితం పట్ల సమాజం పట్ల తమ తల్లిదండ్రుల పట్ల అలాగే విద్యార్థులు తమ జీవితంలో ఎలాంటి స్థాయిలో వారు స్థిరపడాలో అనే ఒక ఖచ్చితమైన ఒక నిర్దిష్టమైన లక్ష్యాలను ఎంచుకొని ఆ లక్ష్యాల సాధన కోసం ఎన్ని ఆటంకాలు, కష్టాలు ఎదురైనా వాటిని అధిగమించినప్పుడే నిజమైన ఆనందాన్ని సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది అన్నారు. విద్యార్థులు చిన్న చిన్న సమస్యలకు మానసికంగా కుంగిపోకూడదని తన విద్యార్థి దశలో తాను కూడా ఎన్నో కష్టాలను చూశానని వాటి అన్నిటిని అధిగమించి ఈరోజు ఈ స్థాయికి ఎదిగానని ప్రతి విద్యార్థి సమయాన్ని వృధా చేసుకోకుండా టైం మేనేజ్మెంట్ చేసుకొని అనుకున్న లక్ష్యం కోసం ఒక డిజైర్ తో కృషి చేయాలని విద్యార్థిని విద్యార్థులకు సూచించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ సెంటర్ ఎండి రామాంజనేయులు గారు, సెంటర్ సిబ్బంది గౌస్, రాజశేఖర్, రామయ్య, నరసింహులు విద్యార్థులు పాల్గొన్నారు

Author

Was this helpful?

Thanks for your feedback!