సబ్ రిజిస్ట్రార్ కె. పి. నారాయణ సేవలు మరువలేనివి 

సబ్ రిజిస్ట్రార్ కె. పి. నారాయణ సేవలు మరువలేనివి 

కర్నూలు, న్యూస్ వెలుగు;  కర్నూలు జిల్లా కురువ సంఘము ఆధ్వర్యంలో జరిగే ప్రతి పనిలో గత 2010 సంవత్సరం నుండి సంఘము చేసే కార్యక్రమాలలో విరివిగా సేవలు అందించిన విశ్రాంత సబ్ రిజిస్ట్రార్ శ్రీ కె.పి నారాయణ  రాయదుర్గం లో కుమారుడు డాక్టర్ మహేష్  దగ్గర ఉండేవారు, అనారోగ్యంతో గురువారం ఉదయం స్వర్గస్తులయ్యారు. ప్రస్తుతం వారి భౌతికదేహం కర్నూలు నగరం లోని స్వగృహం,ఠాగూర్ నగర్ లో కలదు.రేపు 06-12-2024 శుక్రవారం కర్నూలు మండలం పూడూరు గ్రామంలో అంత్యక్రియలు నిర్వహిస్తారని కుటుంబసభ్యులు తెలిపారు.వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాము. వారి కుటుంబ సభ్యులకు కర్నూలు జిల్లా కురువ సంఘము అసోసియేట్ అధ్యక్షులు గుడిసె శివన్న ప్రధాన కార్యదర్శి, ఎం. కె.రంగస్వామి, మాజీ జిల్లా అధ్యక్షులు గడ్డం రామకృష్ణ,జిల్లా కోశాధికారి, కె. సి. నాగన్న,ఉపాధ్యక్షులు ధనుంజయ, బి. వెంకటేశ్వర్లు బి. సి. తిరుపాల్, ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. నారాయణ మృతి కర్నూలు జిల్లా కురువ సంఘం తీరని లోటని వారు పేర్కొన్నారు. ఓర్వకల్ రిజిస్ట్రార్ ఆఫీసు నందు పదవి విరమణ పోందారు. నారాయణ భార్య ముగ్గురు కుమార్తెలు ఒక కుమారుడు డాక్టర్ మహేష్ ఉన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!