అధికారులతో సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి

అధికారులతో సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి

అమరావతి : రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాలు, వరదలతో రోడ్ నెట్ వర్క్ కు తీవ్ర నష్టం జరిగిందని  ముఖ్యమంత్రి  నారా చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల రోడ్ల పరిస్థితి మరింత దారుణంగా తయారు అయ్యిందని వ్యాఖ్యానించారు. వరద ప్రాంతాల్లో సేవలు అందిస్తున్న బ్యాంకర్లు, భీమా ఏజెన్సీలు, ఎలక్ట్రానిక్ సంస్థల యాజమాన్యాలు, వారి సర్వీస్ సెంటర్ల ప్రతినిధులతో ముఖ్యమంత్రి  నారా చంద్రబాబునాయుడు విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు.

అమరావతి ఔటర్ రింగ్ రోడ్, వైజాగ్ నుండి మూలాపేట, విజయవాడ తూర్పు బై పాస్, విజయవాడ -హైదరాబాద్, హైదరాబాద్ -బెంగుళూరు హైవేల విస్తరణ,  హైదరాబాద్ నుండి అమరావతి వరకు కొత్త గ్రీన్ ఫీల్డ్ కారిడార్ కు సంబంధించి ప్రణాళికలు నేషనల్ హైవే అథారిటీ ద్వారా చేపట్టాలనిసీఎం  నారా చంద్రబాబునాయుడు ఆదేశించారు

కేంద్ర ప్రభుత్వ సహాయంతో అమలు చేస్తున్న సేతు బంధన్, గతి శక్తి ప్రాజెక్టుల ద్వారా నిర్మిస్తున్న రోడ్ ఓవర్ బ్రిడ్జిల భూ సేకరణ కోసం పెండింగ్ లో ఉన్న రూ.42 కోట్లు వెంటనే విడుదల చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వెల్లడించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS