
మౌలిక వసతుల కల్పనే లక్ష్యం
స్థాయి సంఘ సమావేశంలో మేయర్ బి.వై. రామయ్య
* 10 అజెండాలకు ఆమోదముద్ర
* రూ.2.06 కోట్ల వినియోగానికి పచ్చజెండా
కర్నూలు, న్యూస్ వెలుగు; నగరంలో మౌలిక వసతుల కల్పనే తమ ప్రధాన లక్ష్యమని నగర మేయర్ బి.వై. రామయ్య అన్నారు. గురువారం నగరపాలక
కార్యాలయంలో స్థాయి సంఘ సమావేశం నిర్వహించారు. 10 తీర్మానాలను, సాధారణ నిధుల నుండి రూ.2.06 కోట్ల నిధుల వినియోగానికి పచ్చజెండా ఊపారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. ప్రజా విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకొని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తూ, ప్రాధాన్యత క్రమంలో నిధులు కేటాయిస్తున్నామన్నారు. సభ్యులు లేవనెత్తిన పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
సమావేశంలో కమిషనర్ యస్.రవీంద్ర బాబు, సభ్యులు యునూస్, క్రాంతి కుమార్, జుబేర్, విక్రమసింహా రెడ్డి, మేనేజర్ యన్.చిన్నరాముడు, ఆరోగ్య అధికారి డాక్టర్ కే.విశ్వేశ్వర్ రెడ్డి, యస్ఈ రాజశేఖర్, సిటి ప్లానర్ ప్రదీప్ కుమార్, ఆర్ఓ ఇశ్రాయోలు, టిపిఆర్ఓ వెంకటలక్ష్మి, అకౌంట్స్ ఆఫీసర్ చుండి ప్రసాద్, ఎగ్జామినర్ సుబ్రమణ్యం, ఎంఈలు శేషసాయి, సత్యనారాయణ, సీ3 జి.ఎం. శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.
ఆమోదించిన తీర్మానాలు:-
1. 91 మంది క్లాప్ ఆటోల డ్రైవర్లకు మూడు నెలల బకాయిలు రూ.32.76 లక్షలను చెల్లించేందుకు పచ్చజెండా ఊపారు.
2. రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి బి.సి. జనార్ధన్ రెడ్డి లేఖ, ప్రజల కోరిక మేరకు దామోదరం సంజీవయ్య (చెక్‌పోస్ట్) నుండి గుంటూరు వెళ్ళు రహదారి విస్తరణ వెడల్పును 120 అడుగుల నుండి 100 అడుగులకు మార్పు చేయుటకు, బాధితులకు టిడిఆర్ బాండ్ల జారీ, ఆర్ అండ్ బి శాఖ నుండి నష్టపరిహారం అందించుటకు అనుమతులు ఇచ్చారు.
3. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వుల మేరకు పెద్దపాడు, ఏ.నాగలాపురం గ్రామాలకు 128 సర్వే నెంబర్ నందు 1.08 సెంట్ల భూమిని స్మశానానికి కేటాయిస్తూ ఆమోదించారు.
4. కాల పరిమితి ముగిసిన కొండారెడ్డి బురుజు సమీపంలోని పూల మార్కెట్‌ను టెండర్ ద్వారా ఇప్పటివరకు వ్యాపారం నిర్వహించుకుంటున్న అసోసియన్ వారి విజ్ఞప్తి మేరకు మరో మూడేళ్లు లీజుకు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
5. బుధవారపేట నందు హిందూ స్మశాన వాటికలో మౌలిక సదుపాయాల కల్పన రూ.50 లక్షలు కేటాయించారు.
6. 41వ వార్డు సిద్దార్థ హోమ్స్ వద్ద రూ.15 లక్షలతో మురుగు కాలువల నిర్మాణానికి టెండర్ పిలుచుటకు ఆమోదం తెలిపారు.
7. రాజ్‌వీహార్ సమీపంలోని ఎల్లమ్మ గుడి నుండి బాపూజీ నగర్ వరకు హంద్రీ ఒడ్డున రహదారి నిర్మాణానికి రూ.50 లక్షలు కేటాయించారు.
8. పార్కుల నిర్వహణకు సంబంధించి కాలపరిమితి ముగిసిన కాంట్రాక్టర్ ద్వారా పనిచేస్తున్న 5 మంది సిబ్బందిని మరో నాలుగు నెలల పాటు, మరో 11 మందిని మూడు నెలల పాటు కాలపరిమితి పొడిగింపునకు అవసరమైన రూ.8.70 లక్షలు కేటాయింపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
9. చెక్‌పోస్ట్ నుండి ఎఫ్.సి.ఐ. కాలనీ, లేపాక్షి కాలనీల మీదుగా దిన్నెదేవరపాడు రహదారికి అనుసంధాన అయ్యే బిటి రహదారి విస్తరణ పనులను చేపట్టుటకు రూ.50 లక్షలు కేటాయించారు.