డిప్యూటీ సీఎం తో కలిసి తుంగభద్ర డ్యామ్ ను పరిశీలించిన ఎమ్మెల్యేలు
ఆలూరు: కర్ణాటక రాష్ట్రంలోని హోస్పేట వద్ద ఉన్న తుంగభద్ర డ్యామ్ శనివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో 19వ గేట్ చైన్ తెగిపోవడం వలన ఆ గేటు నీటి ప్రహవంకి కొట్టుకుపోవడం జరిగింది.
ఈ విషయం తెలుసుకున్న కర్ణాటక డిప్యూటీ సిఎం డీకే శివకుమార్,కూటమి ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు, ఆలూరు వైసిపి ఎమ్మెల్యే బూసినే విరుపాక్షి ఆదివారం అక్కడికి చేరుకొని డ్యామ్ ని పరిశీలించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే విరుపాక్షి మాట్లాడుతూ గేట్ చైన్ తెగిపోవడం వల్ల లక్ష క్యూ సెక్కులకు పైగా నీరు వృధగా పోయాయని మరియు రాయలసీమ రైతులకు వ్యవసాయానికి కావలసిన నీరు వృధా కావడం వలన తీవ్ర నష్ట వాటిల్లిందని తెలిపారు.అలాగే త్రాగునీటికి కూడా చాలా ఇబ్బందిగా మారుతుందన్నారు.
ప్రభుత్వం వెంటనే హై టెక్నాలజీ నిపుణులతో మరమ్మతులు చేపట్టాలని కోరారు.ప్రస్తుత ప్రభుత్వం ప్రతి దానికి డబ్బులు లేవు అంటూ సాకులు చెపుతూ వస్తుందని,అదేవిధంగానే డ్యామ్ మెయింటనెన్స్ కి సరిపడా డబ్బులు ఇవ్వకపోవడం వలనే ఈ పరిస్థితి వచ్చిందని తెలిపారు.