రైల్వే జనరల్ మేనేజర్ కు వినతి పత్రం అందించిన నంద్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు

రైల్వే జనరల్ మేనేజర్ కు వినతి పత్రం అందించిన నంద్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు

డోన్ న్యూస్ వెలుగు: సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ నంద్యాల జిల్లా డోన్ లో రైల్వే స్టేషన్ ను మంగళవారం సందర్శించడం జరిగింది. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షులు, న్యాయవాది డాక్టర్ గార్లపాటి మద్దులేటీ స్వామి,ఆధ్వర్యంలో వినతి పత్రం అందించినట్లు తెలిపారు.

నంద్యాల జిల్లాలో అనేక రైల్వే స్టేషన్ లలో అనేక రకాల సమస్యలు ఉన్నాయని అందులో ప్రదానంగా

గుంతకల్ రైల్వే డివిజన్ లో డోన్ రైల్వే జంక్షన్ అతి పెద్దదని, అయితే ఇక్కడ నుంచి ఢిల్లీ వరకు అనేక మంది పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నాయకులు, ఉన్నత ఉద్యోగస్థులు ప్రయాణం చేస్తూ ఉంటారన్నారు.కావున వందే భారత్ ట్రైన్ డోన్ లో ఆపాలని,పరిసర ప్రాంతాల ప్రయాణీకులకు సీనియర్ సిటిజన్లకు, మహిళలు మరియు వికలాంగుల ప్రయాణీకులకు సౌకర్యం కొరకు రైల్వే స్టేషన్‌లో లిఫ్ట్, ర్యాంప్, ఎస్కలేటర్ సౌకర్యాలను ఏర్పాటు చేయాలని వారు కోరారు. డోన్ కర్నూల్ గేట్ల దగ్గర అండర్ పాస్ బ్రిడ్జి ని మరియు అనేక గ్రామాలకు వెళ్ళడానికి దొరపల్లి దగ్గర సర్వీస్ రోడ్ లకు అనుమతి ఇస్తూ అక్కడే ఒక రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి ని, నిర్మించాలని, కర్నూల్, నంద్యాల జిల్లాలో అనేక రైల్వే స్టేషన్లలో ప్లాట్ ఫారం ఫై గ్రానైట్ పాలిష్ బండలు నిబంధనలకు విరుద్దంగా వేయడం వల్ల అనేకమంది చిన్న పిల్లలు, వృద్ధులు, వికలాంగులు జారీ క్రింద పడి ప్రమాదానికి గురి అవుతున్నట్లు వారు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినట్లు తెలిపారు. రైల్వే స్టేషన్ వెలుపల నూతనంగా వేసిన తారు రోడ్డుపై విచారణ జరిపించాలని వారు కోరారు. డోన్ లో ఉదయం 8 గంటలకు చేరు కొనే విధంగా మరొక పాసింజర్ రైలు ను నడపాలని, కర్నూల్ వరకు వచ్చే తుంగభద్ర ఎక్స్ ప్రెస్ రైల్ ను డోన్ వరకు పొడింగించాలని, రైల్ నెంబర్ 17227/28 ను ప్రతి రైల్వే స్టేషన్ లో ఆపాలని, డోన్, నంద్యాల రైల్వే స్టేషన్ లు అతిపెద్ద జంక్షన్ కలిగి ప్రయాణికుల రద్దీ ఎక్కువ వీరి సౌకర్యం నిమిత్తం రిటైరింగ్ రూంలు, డార్మెటరీ సౌకర్యం కల్పించాలని, మల్కాపురం రైల్వే స్టేషన్ లో మైనింగ్ ఎక్కవ ఇక్కడ అనేక రకాల గూడ్స్ రైలు వచ్చి లోడింగ్ జరగడం వాళ్ళ వలసల గ్రామానికి, బ్యాంకు, స్కూల్ పోవడానికి చాలా ఇబ్బంది ఉన్నదని అందుకు ఈ స్టేషన్ లో ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జి వేయాలనే డిమాండ్ తో కాంగ్రెస్ పార్టీ వినతి పత్రం ఇవ్వడం జరిగిందన్నారు. ఈ అంశాలకు సానుకూలంగా స్పందించడం జరిగింది. ఈ కార్యక్రమం లో న్యాయవాదులు డిసిసి ఉపాధ్యక్షులు ఉన్నిగొర్ల జనార్దన్, డిసిసి ప్రధాన కార్యదర్శి వడ్డే రాజశేఖర్,నాయకులు సుమన్, మోహన్, నవీన్ లు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!