
ముస్లిం మైనార్టీల పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ కి పుట్టినిల్లు
ఎర్రగుంట్ల , న్యూస్ వెలుగు; యర్రగుంట్ల యువనాయకులు సయ్యద్ సలీం, మినరల్ వాటర్ ప్లాంట్ నిర్వాహకులు స్మార్ట్ రియాజ్ ,కడప పార్లమెంట్ మైనారిటీ కార్యదర్శి ఎస్.ఏ పెద్ద సెట్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పైన నమ్మకం తో గెలిపించిన ప్రజలకు తెలుగుదేశం పార్టీ నాయకత్వ మరియు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి మరియు జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి భూపేష్ రెడ్డి ప్రజలకు రుణపడి వుంటారు అని చెప్పారు.అలాగే ఆంధ్రప్రదేశ్ లో మైనారిటీల పైన ప్రేమ కురిపించినట్లు మాయ మాటలు చెప్పి ఓట్లు దండుకొని గత వైసీపీ ప్రభుత్వం మైనారిటీ లకు ఎలాంటి మేలు చేయలేదు అని అన్నారు.గత వైసీపీ ప్రభుత్వం లో దూలహన్ పథకం కింద లక్ష రూపాయలు చెప్పి ఇవ్వలేదు మస్జిద్ ఈమమ్ లకు, మౌజన్ లకు జీతాలు కూడా ఇవ్వలేదు అని ముఖ్యంగా కడప హాజ్ హౌస్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ముస్లింల కోసం ఎంతో ప్రేమ తో కడప జిల్లాలో హజ్ హౌస్ కట్టిస్తే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో హజ్ హౌస్ కు ఏలాంటి పరిస్థితి కి వచ్చిందో వివరించారు.కడప జిల్లా నుండి ఒకే కుటుంబం నుండి ఇద్దరు ముఖ్య మంత్రులుగా చేయడం లో కీలకంగా వున్న ముస్లిం మైనారిటీ లకు వైసీపీ పార్టీ అధికారం లో వచ్చి ఏమి చేయలేదని ముస్లిం లకు నామ మాత్రం పదవులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు తప్ప ముస్లింల అభ్యున్నతికి ఎటువంటి కృషి చేయలేదు అని కడప జిల్లా నుండి గత వైసీపీ ప్రభుత్వం లో ఉపముఖ్యమంత్రి గా వున్న ఆంజాద్ భాష ముస్లిం ల పేరు చెప్పుకొని పదవులు పొంది ముస్లిం ప్రజల అభివృద్ధి కోసం పట్టించు కున్న పాపాన పోలేదని ముస్లిం మైనారిటీల కు ఎలాంటి మేలు జరలేదని కడప జిల్లా ముస్లిం మైనారిటీ లకు అండగా తెలుగుదేశం పార్టీ కడప ఎంపీ అభ్యర్థి చదిపిరాళ్ల భూపేష్ రెడ్డి అండగా వున్నారు అని కడప జిల్లా మైనారిటీ అక్క చెల్లమ్మ లకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా కూడా భూపేష్ రెడ్డి గారు ముందు వుంటారు అని ప్రజలకు ఏ కష్టం వచ్చిన తన కష్టం గా భావించే నాయకుడు భూపేష్ రెడ్డి గారు అని చదిపిరాళ్ళ కుటుంబం అధికారం లో వున్నా లేకున్నా తమ కుటుంబాన్ని నమ్ముకున్న ప్రజల కోసం ఎల్లపుడు అందుబాటులో భూపేష్ రెడ్డి గారు వుంటారు అని స్మార్ట్ రియాజ్ తెలిపారు .గత ప్రభుత్వం కేవలం ఎలక్షన్స్ లకు కొద్దీ రోజుల ముందు మాత్రమే రోడ్డు పనులు మొదలు పెట్టారు అని 5సంవత్సరాలు ఏమి పట్టించుకోలేదు కానీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన కొన్ని రోజులకే రోడ్డు మారమ్మతులు మొదలు పెట్టారు అని పులివెందుల, జమ్మలమడుగు గత ముఖ్యమంత్రి జగన్ గారికి 2 నియోజకవర్గలు ఒకటి పుట్టినిల్లు మరొకటి మెట్టినీళ్లు గా చెప్పుకొచ్చారు కానీ అభివృద్ధి ఏమి చేయలేదు జమ్మలమడుగు నియోజక వర్గ అభివృద్ధి గురించి పట్టించు కున్న పాపాన పోలేదు అని ముద్దునూర్ నుండి పులివెందులకు వెళ్లే రోడ్డు మరియు ఎర్రగుంట్ల నుండి ప్రొద్దుటూరు వెళ్లే రోడ్లు గుంతలు , గతుకుల తొ వుంటే మరమత్తులు కూడా చెయ్య లేదు అని గత వైసీపీ నాయకులు కనీసం రోడ్ల మరమత్తులు కూడా పట్టించు కున్న పాపాన పోలేదని గత 5 సంవత్సరాలు ఏమి పట్టించుకోలేదు అని సయ్యద్ సలీం వాపోయారు..రాబోయే రోజుల్లో యర్రగుంట్ల మీదుగా హైవే రోడ్లు బైపాస్ రోడ్డు రాబోతున్నాయి అభివృద్ధి అంటే మొట్ట మొదట గా గుర్తుకు వచ్చేది దేవగుడి కుటుంబం మాత్రమే అని భూపేష్ రెడ్డి గారి కుటుంబం అధికారం లో వున్నా సమయం లోనే ఇంటర్ కాలేజీ అలాగే డిగ్రీ కాలేజ్ మరియు ఐ.టీ కాలేజ్ వచ్చాయ్ అని అభివృద్ధి జరగాలి అంటే ఒక్క భూపేష్ రెడ్డి గారి కుటుంబం తోనే జరుగుతుంది అని తెలిపారు స్మార్ట్ రియాజ్,సయ్యద్ సలీం వివరించారు..!!
అలాగే రోడ్డు ప్రయాణాలు చేసే టప్పుడు ప్రజలు జాగ్రత్త వహించాలి అని సూచించారు ..!!