రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి

 రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి

కర్నూలు, న్యూస్ వెలుగు; శుక్రవారం  కర్నూల్ కు స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, గౌరవనీయులు సూర్య కుమారి మేడం కమిషనర్ గౌరవనీయులు వేణుగోపాల్ రెడ్డి కర్నూల్ కి వచ్చిన సందర్భంలో రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడి వర్కర్స్ హెల్పర్స్ మినీ వర్కర్స్ కు రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు పెంచక 6 సంవత్సరాలు అయిందని, కేంద్ర ప్రభుత్వం వేతనాలు పెంచక 15 సంవత్సరాల అయిందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రేపటి నుండి ఆరో తేదీలోగా, జరిగే బడ్జెట్ సమావేశాలలో, అంగన్వాడి టీచర్ల కనీస వేతనాలు ఇవ్వాలని గ్రాజి డ్యూటీ అమలు చేయాలని, సంక్షేమ పథకాలన్నీ వర్తింప చేయాలని, ఉచిత గ్యాస్ వర్తింపచేయాలని, తెలుగుదేశం గవర్నమెంట్ ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ 6 పథకాలు కూడా, చేయాలని
మన పొరుగు రాష్ట్రం తెలంగాణ గవర్నమెంట్ అంగన్వాడి టీచర్ల హెల్పర్ల వేతనాలు పెంచిందని, మన కూటమి ప్రభుత్వం కూడా, ఉద్యోగులకుPRC పెంచిందని, మరి అంగన్వాడి వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు, 50 సంవత్సరాల నుండి పనిచేస్తున్నప్పటికీ, నేటికీ గౌరవ వేతనం పేరుతో, మూడు నాలుగు యాప్స్ లలో, పనిచేస్తున్నామని, నారా లోకేష్ , ఉపాధ్యాయులకు, ఓకే యాప్ లో పని చేసే విధానం తెచ్చామని, చెప్పారు. అంగన్వాడి సెంటర్లకు టీచర్లకు, మూడు నాలుగు యాప్లలలో పని చేయడం 2gb మొబైల్స్ లో పనిచేయడం చాలా ఇబ్బంది అయిందని, యాప్స్ అన్నింటినీ కుదించి ఒక యాప్ గా సవరించాలని,
ప్రతినిలా ఐదో తేదీ లోపు గౌరవ వేతనాలు, సెంటారెన్సు కరెంట్ బిల్లులు, ఈవెంట్ బిల్లులు వర్కర్ల ఖాతాలో జమ చేయాలని, అంగన్వాడి చిన్నారులకు వండి వడ్డించడానికి, ప్రస్తుతం ఇస్తున్న రెండు రూపాయల 30 పైసలు, ప్రస్తుతం ఉన్న రేట్లు దేనికి సరిపోడం లేదని తక్షణమే మెనూ రేట్లు పెంచాలని,
రేషన్ షాప్ లలో నాణ్యమైన సరుకులను అంగన్వాడి సెంటర్లకు చేర్చాలని, ప్రజా సాధికార సర్వేలో ప్రభుత్వ ఉద్యోగిన నమోదును తొలగించాలని, అంగన్వాడి కేంద్రాలకు ప్రింటెడ్ రికార్డ్స్ ను వెంటనే ఇవ్వాలని, పంట పాత్రలు 20 సంవత్సరాల క్రిందటి ఇచ్చారని , కర్నూలు జిల్లాలోని అంగన్వాడీ టీచర్ల హెల్పర్ల ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని,వెంటనే పై సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని ఈరోజు కర్నూలు సునయనలో గౌరవనీయులు కలెక్టర్ సమక్షంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి j.లలిత,
జిల్లా ప్రధాన కార్యదర్శి చౌడేశ్వరిలు ప్రిన్సిపల్ సెక్రెటరీ , కమిషనర్ వినతిపత్రం ఇచ్చారు.

Author

Was this helpful?

Thanks for your feedback!