
యువతకు దేశంపై మరింత భక్తి ప్రేరణ పెరుగుతుంది : కేంద్ర మంత్రి
న్యూఢిల్లీ: నేషనల్ వార్ మెమోరియల్ నుండి 7000 కిలోమీటర్ల వాయు వీర్ విజేత కార్ ర్యాలీని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం లాంఛనంగా ప్రారంబించారు. అక్టోబర్ 8న భారత వైమానిక దళం 92 వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని లడఖ్‌లోని థోయిస్ నుండి అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ వరకు కార్ల ర్యాలీని నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు .
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రక్షణ మంత్రి ప్రసంగిస్తూ.. వాయువీర్ విజేత కారు ర్యాలీ యువతలో స్ఫూర్తి నింపడంతో పాటు వైమానిక దళంపై అవగాహన పెంపొందిస్తుందని వారు అన్నారు. వైమానిక దళ అధికారులు విద్యార్థులతో సంభాషిస్తారని, ఇది సాయుధ దళాల పట్ల గౌరవం మరియు ప్రేమను పెంచుతుందని ఆయన అన్నారు. సాయుధ దళాలలో యువత తమ ప్రతిభను ప్రదర్శించే వేదిక అని ఆయన కొనియాడారు.
Was this helpful?
Thanks for your feedback!