
చట్టసభలపై అవగాహన ఉండాలి: టిజీ వెంకటేష్
నంద్యాల: కర్నూలు న్యూస్ వెలుగు: దేశంలో అత్యున్నత రాజ్యాంగ సంస్థలైన చట్టసభల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాది రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్థానిక కెవి సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల నందు ఓట్ చోరీ అంశంపై మాక్ పార్లమెంటును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ చట్ట సభలు అంటే రాజకీయ నాయకులు ఒకరినొకరు అర్చుకునే ప్రాంతం అనే అభిప్రాయము చాలామందిలో ఉందన్నారు. కేవలం చర్చల సమయంలోనే ఆ విధంగా ఉంటుంది తప్ప తర్వాత అందరూ సభ్యులు క్రీడా స్ఫూర్తి కలిగి కలిసిమెలిసి ఉంటామన్నారు. కొన్ని బిల్లులు చట్ట సభలలో చర్చకు రావని, అవి ఎలా ఆమోదిస్తారని చాలామంది అనుకుంటూ ఉంటారని అది తప్పన్నారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో అన్ని పార్టీలకు చెందిన 35 మంది సభ్యులు ఉంటారని, వారందరూ కలిసి చర్చించిన తర్వాతనే బిల్లును తయారుచేసి పార్లమెంట్ ఆమోదం కొరకు పంపడం జరుగుతుందని టీజీ తెలిపారు. దేశంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సాహసోపితమైన నిర్ణయాలు తీసుకుందని ఆయన తెలిపారు. ఆర్టికల్ 370 వల్ల కాశ్మీర్ భారతదేశంలో ఉన్నప్పటికీ, ఆ ప్రాంతానికి చెందని ఏ భారతీయుడు కూడా అక్కడ స్థలం కొనడానికి అవకాశం ఉండేది కాదన్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడ అందరి భారతీయులకు సమాన హక్కులు వచ్చాయని తెలిపారు. అలాగే దేశంలో పన్నులు ఇష్టా రీతిలో ఉండేటువంటి వాటన్నిటిని క్రమబద్ధకరించి జీఎస్టీ ని తీసుకురావడమే కాకుండా, దానిని సమర్థవంతంగా అమలు చేస్తున్నటువంటి ఘనత బిజెపికే దక్కుతుందని ఆయన తెలిపారు. ప్రపంచంలో అన్ని దేశాల రాజ్యాంగాలకన్నా భారత రాజ్యాంగం ఎంతో గొప్పదని అన్నారు. దేశంలో ఎంతో గొప్ప వారేనా రాష్ట్రపతి, ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు న్యాయాధిపతి కూడా ఒకరిపై ఒకరికి అధికారం ఉన్న, రాజ్యాంగానికి లోబడి ఒకరి నిర్ణయాన్ని మరొకరు అనుసరించాల్సి ఉంటుందని టీజీ వెంకటేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కెవి సుబ్బారెడ్డి విద్యాసంస్థల చైర్మన్ కెవి సుబ్బారెడ్డి,, బిజెపి నాయకురాలు గీత మాధురి తదితరులు పాల్గొన్నారు.

