883 అడుగులకు చేరిన నీటి మట్టం :శ్రీశైలం
నంద్యాల : శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు.
జూరాల ప్రాజెక్టు నుంచి 2లక్షల 69వేల 914 క్యూసెక్కులు నీటిని , సుంకేసుల జలాశయం నుంచి 81వేల909 క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్టు 10 రేడియల్ క్రస్ట్ గేట్లను 12 అడుగుల మేర ఎత్తి స్పిల్ వే ద్వారా 3లక్షల10వేల 840 క్యూసెక్కులు, శ్రీశైలం కుడి, ఎడమగట్టు జలవిద్యుత్తు కేంద్రంలో విద్యుత్తు ఉత్పత్తి చేస్తూ 64వేల 338 క్యూసెక్కులను నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. జలాశయ పూర్తి స్థాయి నీటిమట్టం…885 అడుగులు కాగా… ప్రస్తుతం 883 అడుగులకు చేరుకుందని ప్రాజెక్ట్ అధికారులు మీడియాకు తెలిపారు .
Was this helpful?
Thanks for your feedback!