
ఏ ఏ క్షేత్రాలను దర్శిస్తే.. చక్ర స్థితులు కలుగుతాయి..!!
న్యూస్ వెలుగు, శ్రీశైలం:
1. మూలాధార చక్రము – గణపతి క్షేత్రం.(కాణిపాకం)
2.స్వాధిష్ఠాన చక్రము – నారాయణ క్షేత్రాలు, లక్ష్మీదేవి క్షేత్రాలు (కొల్హాపురం)
3.మణిపూరక చక్రము – 108 దివ్య విష్ణు క్షేత్రాలు,( పండరీపురం) శ్రీ కృష్ణ క్షేత్రాలు
4.అనాహత చక్రం -మహాకాళి క్షేత్రాలు, మహాకాలుడు క్షేత్రాలు (ఉజ్జయిని)
5.విశుద్ధి చక్రము – మహా సరస్వతి క్షేత్రాలు , గాయత్రీ దేవి క్షేత్రాలు. ( బాసర)
6.ఆజ్ఞా చక్రము – శివ శక్తి క్షేత్రాలు, శివ కేశవ శక్తి క్షేత్రాలు, రాధా కృష్ణ క్షేత్రాలు.
(కాశీ, శ్రీశైలం ,బృందావనం)
7. గుణ చక్రం – దత్త స్వామి క్షేత్రాలు. ( గాణ్గాపురం)
8. కర్మచక్రం – శ్రీరామ క్షేత్రాలు. (అయోధ్య)
9.కాలచక్రం- కాలభైరవ, భైరవి క్షేత్రాలు. (కాశీ, శ్రీశైలం, ఉజ్జయిని)
10. బ్రహ్మ చక్రం- బ్రహ్మ దేవుడి క్షేత్రాలు. ( పుష్కర్, చిదంబర క్షేత్రం)
11.సహస్రార చక్రం – మహాశివుడు క్షేత్రాలు , మహావిష్ణు క్షేత్రాలు, శ్రీ కృష్ణ క్షేత్రాలు.(ద్వారక, బృందావనం)
12.హృదయ చక్రం- అనంతపద్మనాభ క్షేత్రం. (తిరువనంతపురం) హనుమ క్షేత్రాలు( కాశి) ఇష్టలింగం క్షేత్రం(కర్ణాటక)
13.బ్రహ్మరంధ్రము – ఆది పరాశక్తి క్షేత్రం – దీప దుర్గ క్షేత్రం(తుముకూరు) – దీప కాళికా క్షేత్రం – దీప ఛంఢి క్షేత్రం
త్రి గ్రంధులు – త్రిమూర్తుల క్షేత్రాలు, త్రిశక్తుల క్షేత్రాలు.
మన యోగ చక్రాల మీద ప్రభావము చూపే గ్రహాలు :
1. మూలాధార చక్రము – ఎరుపు – కుజుడు
2.స్వాధిష్ఠాన చక్రము – పసుపు పచ్చ- బుధుడు
3.మణిపూరక చక్రము – కాషాయరంగు- గురువు
4.అనాహత చక్రం – ఆకుపచ్చరంగు- శుక్రుడు
5.విశుద్ధి చక్రము –నీలం- శని
6.ఆజ్ఞా చక్రము – ముదురు వంకాయ రంగు-అర్ధచంద్రుడు
7. గుణ చక్రం – ముదురు వంకాయ రంగు- మధ్యస్ధ చంద్రుడు
8. కర్మచక్రం – ముదురు వంకాయ రంగు- చంద్రుడు
9.కాలచక్రం- ముదురు వంకాయ రంగు- అమావాస్య చంద్రుడు
10. బ్రహ్మ చక్రం- ముదురు వంకాయ రంగు- పౌర్ణమి చంద్రుడు
11.సహస్రార చక్రం – లేత వంకాయ రంగు- సూర్యుడు
12.హృదయ చక్రం- లేతనీలం- గ్రహణ సూర్యచంద్రుడు
13.బ్రహ్మరంధ్రము – తెలుపు – అంతరిక్షం.