న్యూస్ వెలుగు, కర్నూలు; ప్రపంచ 65వ అంతర్జాతీయ విభి

న్న ప్రతిభావంతుల దినోత్సవ సందర్భంగా అంబిక శిశు కేంద్రం నందు ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సుకు ముఖ్య అతిథులుగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి జిల్లా న్యాయ సేవాధికర సంస్థ కార్యదర్శి బి. లీల వెంకట శేషాద్రి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ మానసిక దివ్యాంగుల అవసరార్థం అనేక చట్టాలు వున్నాయని వాటిని సరైన రీతిలో ఉపయోగించి సత్వర న్యాయం పొంద వచ్చునని తెలిపారు.మానసిక దివ్యాంగుల సంరక్షణ కొరకు స్నేహ పూర్వక న్యాయ సేవల పథకం 2005 గురించి వివరించారు. వీరందరికి ఉచిత న్యాయ సహాయం అందించబడుతుందని తెలియజేశారు.ఉచిత న్యాయ సహాయం కోరువారు లీగల్ సర్వీసెస్ హెల్ప్ లైన్ నంబర్-15100 ఉపయోగించుకోవలసిందిగా కోరారు. అనంతరం అవసరమైన మానసిక దివ్యాంగులకు 5 వీల్ చైర్లను అందజేశారు.
Thanks for your feedback!