
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం కార్యక్రమం
నంద్యాల, న్యూస్ వెలుగు: శ్రీశైలం నియోజకవర్గం బండి ఆత్మకూరు మండలం నారాయణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం, ఆశాడే కార్యక్రమం నిర్వహించారు. మహిళలు ప్రెగ్నెంట్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, అదేవిధంగా ఎముకల పటిష్టత గురించి క్యాల్షియం తీసుకోవాల్సిన మోతాదు గురించి, వేసవిలో వడదెబ్బకు గురికాకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి, హెచ్పివి టీకా, ఓ ఆర్ ఎస్, జింక్, పోలిక్ యాసిడ్ మందుల ఉపయోగం గురించి ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ దినేష్ వివరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్స్, పిహెచ్ సి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!

