అయ్యా … రైళ్ళను పునరుద్దరించండి!

Kurnool (కర్నూలు ) :గుంతకల్లు రైల్వే డివిసన్ పరిదిలోని పెండేకల్లు రైల్వే జంక్షన్ పరిదిలోని ౩౦ గ్రామాల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత మూడేళ్ళుగా ఇక్కడ నుండి సుదూర ప్రాంతాలైన బెంగుళూరు, హైదరాబాదు , చెన్నై, విశాకపట్నం, తిరుపతి వెళ్లేందుకు ప్రధాన మార్గంగా వెళ్ళే  రైళ్ళను రైల్వే అధికారులు నిలుపుదల చేయడం తో ప్రయాణికులు  అనేక ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. పెండేకల్లు జంక్షన్ నుండి కర్నూలు జిల్లా కేంద్రానికి వెళ్లేందుకు ఉన్న అనేక  రైళ్ళను గుంతకల్లు రైల్వే డివిసన్ అధికారులు నిలుపుదళ చేశారు. పెండేకల్లు జంక్షన్ నుండి గుంతకల్లు , గుత్తి , నంద్యాల, కర్నూలు వంటి ప్రధాన ప్రాంతాలకు వెళ్ళే వందల మంది ప్రయాణికులు మెరుగైన  వైద్య, విద్య  సౌకర్యలకోసం  కర్నూలు జిల్లా కేంద్రానికి వెళ్ళాలంటే సుమారు 120 కిలోమీటర్ల మేర బస్సు ప్రయాణం చేయాల్సి ఉంటుందని దీనివల్ల అత్యవసర వైద్య సేవలు పొందలేక 30 గ్రామాల ప్రజలు అవస్తలు పడుతున్నారని స్థానిక ప్రజలు , ప్రజాసంఘాలు, విధ్యార్ది నాయకులూ తెలిపారు. పెండేకల్లు జంక్షన్ నుండి రోజుకు వందల మంది ప్రయాణికులు ఇక్కడి నుండి ప్రయాణం చేయడం జరుగుతుందని దీనిపై గుంతకల్లు రైల్వే డివిసన్ అధికారులు, స్థానిక ఎమ్మెల్యే కెఈ శ్యాంబాబు , ఎంపి బస్తిపాడు నాగరాజు స్పందించి  వైద్యం , విద్య, ఇతర ప్రయాణ సౌకర్యాలు కల్పించాలని స్థానిక ప్రజలు, ప్రజా సంఘాలు కోరుతున్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!