
ఫీజు పోరు కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ నాయకులు
తుగ్గలి న్యూస్. వెలుగు: వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు సోమవారం రోజున జిల్లా కేంద్రాలలో చేపట్టిన విద్యార్థుల ఫీజు పోరు కార్యక్రమానికి తుగ్గలి మండల వైఎస్ఆర్సిపి నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు.ఈ సందర్భంగా విద్యార్థుల ఫీజు పోరు ఫ్లకార్డులతో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట వారు నిరసనను వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన కూడా ఇంతవరకు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం జమ చేయలేకపోవడంతో వారు నిరసనను వ్యక్తం చేశారు.ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు ఇవ్వవలసిన బకాయిలను చెల్లించి న్యాయం చేయాలని వారు ప్రభుత్వం డిమాండ్ చేశారు.లేనియెడల విడతల వారీగా ఫీజు పోరు కార్యక్రమాన్ని ఉదృతం చేస్తామని వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి జిల్లా ఉపాధ్యక్షులు జిట్టా నాగేష్,వైఎస్ఆర్సిపి రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి,జడ్పిటిసి పులికొండ నాయక్,శ్రీరంగడు,మాజీ జెడ్పిటిసి నారాయణ నాయక్,మాజీ సర్పంచ్ ఎర్రగుడి రామచంద్రా రెడ్డి, బసిరెడ్డి,రామకొండ సుధాకర్ రెడ్డి, బొందిమడుగుల ఈశ్వర్ రెడ్డి,రాము నాయక్ వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.