రోడ్డు ప్రమాదకర బాధితులను ఆదుకుంటాం  :డిప్యూటీ సీఎం

రోడ్డు ప్రమాదకర బాధితులను ఆదుకుంటాం :డిప్యూటీ సీఎం

చిత్తూరు  : చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగలి కనుమదారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారని తెలిసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్  దిగ్భ్రాంతికి గురయ్యాను.  ఈ ఘోర ప్రమాదంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ తో సహా ఎనిమిది మంది మృత్యువాత పడటం, 31 మంది గాయపడటం బాధాకరం అన్నారు . మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు .

బాధిత కుటుంబాలను ప్రభుత్వం తగిన విధంగా ఆదుకొంటుందని అయన హామీ ఇచ్చారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని వైద్య అధికారులను ఆదేశించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS