
గ్రామీణాభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం
తుగ్గలి ఆగస్టు 09 ( వెలుగు న్యూస్ ): గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని టీడీపీ శ్రేణులు పేర్కొన్నారు. తుగ్గలి మండలం దిగువ చింతలకొండ గ్రామంలో ఆదివారం నిర్వహించిన ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమంలో వారు ఇంటింటికీ తిరిగి ప్రజలను కలుసుకున్నారు. ఈ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు తిరుపాల్ నాయుడు నేతృత్వంలో జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ జెడ్పీ చైర్మన్ బత్తిన వెంకట రాముడు, ఉప్పర్లపల్లి సొసైటీ అధ్యక్షుడు అప్పా వేణుగోపాల్ రాయల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యం పెరిగిందన్నారు. అలాగే తుగ్గలి మండలంలో ఎమ్మెల్యే కే.ఈ.శ్యామ్ కుమార్ చేపడుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అనంతరం గ్రామస్థులతో మాట్లాడి స్థానికంగా నెలకొన్న సమస్యలను తెలుసుకున్నారు. ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు ఉప్పర్లపల్లి సొసైటీ డైరెక్టర్ చిన్న పెద్దయ్య, గుత్తి వెంకట్రాముడు, లక్ష్మన్న, కేశవులు కే.నాగేష్, డి.హుస్సేన్ పీరా, దస్తగిరి, రమేష్, కే.శ్రీనివాసులు, కే.సురేష్, ఖాజావలి, కే.హనుమప్ప డి.హుస్సేనీ అల్లా బకాష్, తాతయ్య, మాజీ ఎంపీపీ కొమ్ము వెంకటేష్, నాయకులు గంగసాని మోహన్, సోమశేఖర్ గౌడ్, కొత్తూరు చక్రపాణి, రాంపల్లి సుభాష్ చంద్రబోస్, హనుమంతు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

