రాయలసీమ యూనివర్సిటీ బ్యాడ్మింటన్ మహిళా జట్టుకు సత్కారం
న్యూస్ వెలుగు, కర్నూలు; 2024 దా దానవంబరు 26 నుండి 30 వరకు VTU బెళగావి ఆధ్వర్యంలో ఇటీవల ముగిసిన సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ బ్యాడ్మింటన్ మహిళల టోర్నమెంట్లో రాయలసీమ విశ్వవిద్యాలయం బ్యాడ్మింటన్ మహిళా జట్టు 3వ స్థానంలో నిలిచింది మరియు 2024 – 25 సంవత్సరానికి గాను ఖేలో ఇండియా యూనివర్శిటీ గేమ్స్‌కు యూనివర్సిటీ బ్యాడ్మింటన్ మహిళా జట్టు అర్హత సాధించారు. ఈ సందర్భంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం క్రీడాకారులు, కోచ్‌లకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసింది.
ఈ కార్యక్రమంలో యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎన్ టి కె నాయక్ , రిజిస్ట్రార్ డాక్టర్ బి విజయ కుమార్ నాయుడు పాల్గొన్నారు. వైస్ ఛాన్సలర్ మాట్లాడుతూ, అద్భుతమైన విజయాన్ని సాధించినందుకు జట్టు సభ్యులకు ధన్యవాదాలు మరియు ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌లో విజేతలుగా రావాలని కోరారు. ఆల్ ఇండియా మరియు ఖేలో ఇండియాకు వరుసగా మూడుసార్లు అర్హత సాధించిన ఏకైక విశ్వవిద్యాలయం మనదే మరియు మరే ఇతర ఆంధ్ర ప్రదేశ్ విశ్వవిద్యాలయాలు ఈ ఘనత సాధించలేదని పేర్కొన్నారు. యూనివర్శిటీకి ఖ్యాతి తీసుకొచ్చినందుకు వైస్ ఛాన్సలర్ జట్టు సభ్యులను జ్ఞాపికలతో సత్కరించారు.
బృందం సభ్యులను రిజిస్ట్రార్ కూడా అభినందించారు మరియు వారికి శుభాకాంక్షలు తెలిపారు.
అలాగే ఖేలో ఇండియా యూనివర్శిటీ గేమ్స్‌ను ఏప్రిల్ లేదా మే నెలలలో నిర్వహిస్తారు అని ఫిజికల్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ కెవి శివ కిషోర్ తెలియజేసారు మరియు టోర్నమెంట్ కోసం ఆటగాళ్లు తమ వంతు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ రామకృష్ణ డిగ్రీ కాలేజ్ ఫిజికల్ డైరెక్టర్ విజయ కుమారి మేడం పాల్గొన్నారు .జట్టు వివరాలు
ఎం ఆకాంక్ష, ఎన్ జాహ్నవి, సీహెచ్ఎస్ ఆర్ ప్రణవి, ఎఫ్ షిరీన్, ఎల్ మామైక్య సభ్యులుగా ఉన్నారు వీళ్లంతా నంద్యాలలోని రామకృష్ణ డిగ్రీ కాలేజ్ లో చదువుతున్నారు.
జట్టు మేనేజర్ మరియు కోచ్ జి హేమంత్ రెడ్డి తెలిపారు.