
నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపిన మాజీ జడ్పీటీసీ వరలక్ష్మి
తుగ్గలి, ఆగస్టు 27 ( వెలుగు న్యూస్ ) : మండల కేంద్రమైన తుగ్గలిలో బెస్త రామాంజనేయులు కుమార్తె వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ శుభకార్యానికి ముఖ్య అతిథులుగా మాజీ జడ్పీటీసీ తుగ్గలి వరలక్ష్మి, ఆమె కుమారుడు వంశీకృష్ణ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వధూవరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపి, వారి వైవాహిక జీవితం ఆనందమయంగా, సుఖసంతోషాలతో కొనసాగాలని ఆకాంక్షించారు. అనంతరం వివాహానికి హాజరైన కుటుంబ సభ్యులు, బంధువులతో ఆప్యాయంగా సంభాషిస్తూ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానికంగా రాజకీయ, సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్న మాజీ జడ్పీటీసీ తుగ్గలి వరలక్ష్మి వివాహ వేడుకకు హాజరు కావడంతో కుటుంబ సభ్యులు, బంధువులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు చెరువు నెట్టికల్, గుల్లపాలెం రామాంజనేయులు, లక్ష్మీనారాయణ, రంగస్వామి తదితరులు పాల్గొన్నారు. వివాహ వేడుకకు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సన్నిహితులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నూతన దంపతులకు శుభాశీస్సులు అందజేశారు.

