కల్లూరు, న్యూస్ వెలుగు;  మండల పరిధిలోని   బొల్లవరం  గ్రామంలో   శుక్రవారం  రెవిన్యూ సదస్సులో ప్రతి రైతు  భూ సమస్యలను 

   పరిష్కరించడం జరుగుతుందని  కల్లూరు డిప్యూటీ తహసిల్దార్ ఐ .శివ రామ్  అన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం రెవిన్యూ భూ సమస్యల పరిష్కారం దిశగా గ్రామ స్థాయిలోనే రెవిన్యూ సదస్సులను చేసి అధికార యంత్రాంగాన్ని గ్రామాలల్లో ప్రజలకు అందుబాటులో ఉంచి సమస్యలను పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టడం జరిగిందన్నారు.  కావున ప్రజలు తమ భూములకు సంభందించి ఏమైనా సమస్యలు ఉంటే అర్జీ రూపంలో సమర్పిస్తే సత్వర పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు  సారథ్యంలో ప్రజా సంక్షేమమే పరమావధిగా అభివృద్ధి ఆశయంగా ప్రజా  పాలన కొనసాగుతుందని  భూకబ్జాలు, భూరికార్డుల తారుమారు తదితర ఆకృత్యాలకు తావు లేకుండా మన కూటమి ప్రభుత్వం రెవెన్యూ యంత్రాంగాన్ని మరింతగా పటిష్ట పరిచే ప్రణాళికను తయారు చేస్తుందని  గ్రామ టిడిపి అధ్యక్షుడు ఎన్. విజయకుమార్, గ్రామ టిడిపి కార్యదర్శి బి.వి.జి. మస్తాన్ నాయుడు అన్నారు.  ఈ కార్యక్రమంలో  బొల్లవరం గ్రామ సర్పంచ్  జయన్న గౌడ్,  మండల సర్వేయర్ శ్రీనివాసులు, గ్రామ వీఆర్వో నాగ మద్దయ్య , సర్వేయర్ పురుషోత్తం, మండల ఎండోమెంట్ ఆఫీసర్ చంద్రశేఖర్, ఏబీవో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ లక్ష్మీదేవి బాయి, మండల నోడల్ ఆఫీసర్ నాగ సుధ, , గ్రామ టిడిపి అధ్యక్షుడు ఎన్. విజయకుమార్, గ్రామ టిడిపి కార్యదర్శి బి.వి.జి . మస్తాన్ నాయుడు, గ్రామ స్కూల్ కమిటీ చైర్మన్ డి. మస్తాన్  గ్రామ ప్రజలు  తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో  బొల్లవరం గ్రామ సర్పంచ్  జయన్న గౌడ్,  మండల సర్వేయర్ శ్రీనివాసులు, గ్రామ వీఆర్వో నాగ మద్దయ్య , సర్వేయర్ పురుషోత్తం, మండల ఎండోమెంట్ ఆఫీసర్ చంద్రశేఖర్, ఏబీవో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ లక్ష్మీదేవి బాయి, మండల నోడల్ ఆఫీసర్ నాగ సుధ, , గ్రామ టిడిపి అధ్యక్షుడు ఎన్. విజయకుమార్, గ్రామ టిడిపి కార్యదర్శి బి.వి.జి . మస్తాన్ నాయుడు, గ్రామ స్కూల్ కమిటీ చైర్మన్ డి. మస్తాన్  గ్రామ ప్రజలు  తదితరులు పాల్గొన్నారు.     
 
 
 
 
                
                    
                    
                    
                    
                    
                
                            
        
			
				
				
				Thanks for your feedback!