మా పొలం సమస్య పరిష్కరించండి సారూ…

మా పొలం సమస్య పరిష్కరించండి సారూ…

హోళగుంద, న్యూస్ వెలుగు: మండల పరిధిలో వందవాగలి గ్రామానికి చెందిన గుద్దుగ కాళీంగమ్మ భర్త గుద్దుగ తిమ్మప్ప అనే రైతు శుక్రవారం తమ పొలం సర్వే నంబర్ 96 ఏ భూమిని ఆన్లైన్ లేకుండా చేశారని తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన తెలియజేశారు.ఈ సందర్భంగా గుద్దుగ కాళీంగమ్మ మాట్లాడుతూ నా భర్తకు రెండు కాళ్లు బాగా లేవని,దాదాపు మూడు సంవత్సరాలగా భూమికి సంబంధించిన రిజిస్టర్ డాక్యుమెంట్ పట్టుకొని సమస్య పరిష్కరించాలని కార్యాలయం చుట్టూ తిరుగుతున్న ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.దీని పై ఉన్నత అధికారులు చర్య తీసుకుని మా పొలం సమస్యను పరిష్కరించాలని కోరారు.

Author

Was this helpful?

Thanks for your feedback!